చంద్రబాబు స్క్రిప్ట్ మేరకే పవన్ కల్యాణ్ వాలంటీర్లపైనా, సీఎం జగన్‌పైనా విమర్శలు చేస్తున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ… వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. వాలంటీర్ వ్యవస్థను దేశమంతా ప్రశంసిస్తోందన్నారు.
నీతి అయోగ్ సమావేశంలోను వాలంటీర్లను అభినందించారని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ వ్యవస్థను కొనియాడారన్నారు. ఎలాంటి అవినీతికి తావులేకుండా వాలంటీర్లు పారదర్శకంగా పనిచేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలు ఉండేవని, వారు దోచుకున్నారని ఆరోపించారు. కానీ వాలంటీర్లు జన్మభూమి కమిటీల్లా దోపిడీలకు పాల్పడటం లేదన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించారన్నారు.