Saturday, November 23, 2024

Critical Surgery.. వణుకుడు జబ్బుకు మెదడులో చిప్ తో చెక్…

గుంటూరు మెడికల్ జూన్5 (ప్రభ న్యూస్) – వణుకుతూ నడవడం వణుకుతూ ఉండేవారికి మెదడులో చిప్స్ ను అమర్చడం ద్వారా వారు సాధారణ జీవితాన్ని తిరిగి పొందేలా అమెరికా లాంటి అత్యున్నత దేశాల్లో జరిగే అరుదైన సర్జరీని గుంటూరులో సర్జరీలలో బాహుబలి గా పేరుందిన డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి అమెరికా నుంచి వైద్య పరికరాలను తెప్పించి రోగికి పునర్జన్మను ప్రసాదించిన అరుదైన సంఘటన గుంటూరులో నమోదయింది. ఈ అరుదైన ఆపరేషన్కు సంబంధించిన వివరాలను ఆదివారం బ్రిందా న్యూరో సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. డాక్టర్ భవన హనుమ శ్రీనివాసు రెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లా వినుకొండ మండలం కొండముట్ల గ్రామానికి చెందిన తోట రమణమ్మ గత 8 సంవత్సరాలుగా వణుకుడి జబ్బుతో నడవలేక పోతుంది. చేయమనుకుంటా నడవలేక పోవుట ఈ జబ్బు లక్షణాలు ఎన్ని మందులు వాడినా ఉపయోగాలు లేకపోవడంతో హైదరాబాద్ చెన్నైలో కూడా అన్ని పరీక్షలు చేపించినప్పటికీ కేవలం సర్జరీ తోనే ఉపయోగముందని మరియు ఇది ఖర్చుతో కూడుకుందని అక్కడ వైద్యులు ఆమెతో చెప్పారు ఈ సర్జరీని డీప్ బ్రెయిన్ సిమిలేషన్ అని అంటారని న్యూరో సర్జరీ వైద్య విధానంలో అత్యంత ఖరీదైన చివరి దశతో కూడుకున్న సర్జరీగా దీనికి పేరు ఉన్నదని వైద్యులు వారికి తెలియజేశారు.

ఈనేపద్యంలో దాదాపు 6 కోట్ల రూపాయల ఖరీదైన వైద్య పరికరాలను అరువు పద్ధతిలో అమెరికా నుంచి తీసుకువచ్చి రోగిని మేలుకువలో ఉంచి చిన్న మెదడులోని చాలా సున్నితమైన పరిణామం లో ఉన్న దారంలో వందో వంతు ఉన్న నరాన్ని ఎంపిక చేసుకొని రెండు నుంచి నాలుగు మిల్లీమీటర్ల పరిణామములో కుడివైపు నాలుగు చిప్ లు, ఎడమవైపు నాలుగు చిప్ లను విజయవంతంగా మెదడులో ప్రవేశపెట్టారు. దాదాపు 20 లక్షల రూపాయల ఖరీదైన ఈ ఆపరేషన్ను బాహుబలి సర్జన్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి 10 లక్షల ఖర్చుతో అది కూడా అమెరికా నుంచి తెప్పించిన పరికరాల కోసం అయ్యే ఖర్చుతోనే రోగికి విజయవంతంగా చిప్ లను మెదడులో అమర్చారు. ఈ సర్జరీలో ప్రముఖ డీప్ బ్రెయిన్ సిమిలేషన్ వైద్య నిపుణులు డాక్టర్ ప్రవీణ్, న్యూరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ అరవింద, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ త్రినాథ్ లు పాల్గొన్నారు. రోగి ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన వైద్య బృందాన్ని బ్రిందా న్యూరో సెంటర్ డైరెక్టర్ డా.జమ్మగాని అనిత, సాయి కృష్ణ ప్రసాద్ వసంతలు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement