అనంతపురం : అనంతపుంర జిల్లాలో ఈ రోజు ఒక విచిత్రమైన ఘటన జరిగింది. తావీదు మహిమ కారణంగా.. మహిళ మెడలో బంగారు చైను దొంగలించడానికి ప్రయత్నం చేసిన.. దొంగలకు బంగారు చైను దొరకలేదు కానీ, తావీదు చేతికి చిక్కింది. దొంగలు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో తావీదు వల్లనే బంగారు చైను దక్కిందని ఆ మహిళ సంబరపడిపోతోంది. నగరంలోని వేణుగోపాల్ నగర్ లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..
వేణుగోపాల్ నగర్ లో ఉదయం ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు చైన్ స్నాచర్లు.. దుకాణానికి వెళ్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కోవాలని ప్రయత్నించారు. మహిళా అప్రమత్తం కావడంతో ఆమె మెడలోనుంచి బంగారు గొలుసు బదులు తాయెత్తు వారి చేతికి చెక్కడంతో దాంతోనే లగెత్తారు.
కాగా, అనంతపురం సిటీలో ఈ మధ్యకాలంలో అనేక చోట్ల చైన్ స్నాచర్లు చేతివాటం చూపుతున్నారు. పోలీసులు వీరిపై నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.