రాజమండ్రి – తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో భర్త చేతిలో శిరోముండనానికి గురైన బాధితురాలి షేక్ ఆషా ను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామర్శించారు.. రాజమండ్రి ప్రభుత్వ హాస్పటల్లో చికిత్స పొందుతున్న ఆమె వద్దకు నేడు ఆయన వెళ్లారు.. బాధితురాలికి ఆయన ధైర్యం చెప్పారు.. నిందితుడిని కఠినంగా శిక్షిస్తానని ఆయన హామీ ఇచ్చారు.. ఘటన జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు…
కేసు వివరాలలోకి వెళితే పెదకొండేపూడికి చెందిన కర్రి రాంబాబు అలియాస్ అభిరామ్ హైదరాబాద్ లో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేసేవాడు. నెల్లూరుకు చెందిన జూనియర్ ఆర్టిస్టు షేక్ ఆషా(26)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి ఇద్దరూ ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకు న్నారు. ఏడాది తర్వాత కుమారుడు పుట్టగా అప్పటినుంచి రాంబాబు ముఖం చాటేశాడు. అతనిపై ఆషా ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు కేసు నమోదుచేశారు. రాంబాబు తల్లిదండ్రులు వెళ్లి ఆషాను ఒప్పించి ఆ కేసు ఉపసంహరించుకోవాలని, ఆమెను పెదకొండేపూడి తీసుకొచ్చారు.
రాంబాబు కూడా వచ్చేసి పోలవరం ప్రాజెక్టులో ఓ అధికారి వద్ద కారు డ్రైవర్గా కుదిరాడు. కొంతకాలం కాపురం సజావుగానే సాగింది. నాలుగేళ్ల క్రితం భార్యను బయటకు గెంటేశాడు. భర్త, అత్తమామలపై ఆమె వర కట్న వేధింపుల కేసు పెట్టడంతో సీతానగరం పోలీసులు కేసు నమోదుచేశారు. పెదకొండేపూడి గిరిజనుల ఆశ్రయంలోనే కొన్నాళ్లపాటు ఆషా ఉన్నారు. అనంతరం హైదరాబాద్ వెళ్లి అక్కడ పని చేసుకుంటున్నారు. భర్తకు రెండో పెళ్లి చేస్తున్నారని తెలిసి రెండు నెలల క్రితం బిడ్డను తీసు కుని సీతానగరం వచ్చి న్యాయం కోసం పోరాడుతున్నారు. రాంబాబుతో పాటు అత్తమామలపై పెట్టిన 498(ఎ) కేసును ఉపసంహరించుకుంటేనే కాపురం ఉంటుందని.. లేకుంటే ఆస్తి, ఇంటిని కూడా రాంబాబు సోదరికి రాయిం చేస్తామని మండలస్థాయి పా నేతలు బెదిరించారని బాధితురాలు వాపోయారు.
భర్తకు రెండో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసి నాలుగు రోజుల క్రితం అత్తింటికి బిడ్డతో చేరుకున్నారు. అత్తమామలు తమ కుమారుడికి సమాచారం అందించారు. రాంబాబు శుక్రవారం ఉదయం ఇంటికొచ్చి భార్యను గదిలో బంధించాడు. ఆమె నడు ముపై కూర్చొని ట్రిమ్మర్తో శిరోముండనం చేశాడు.. కిటికీలోంచి ఓ వ్యక్తి చూసి ప్రశ్నించగా లోపలికి వస్తే ఆమె గొంతు కోస్తానని బెదిరించాడు. వేరుచేసిన జుట్టును ఒక చేత్తోనూ, ఆమెను మరో చేత్తోనూ పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు వచ్చి ఆ వీధిలో తిప్పాడు.
తిరుపతిలో గుండు గీయించుకున్నానని చెప్పు..
ఎవరైనా అడిగితే తిరుపతి వెళ్లి గుండు గీయించుకు న్నానని చెప్పాలంటూ రాంబాబు భార్యను హెచ్చరిం చాడు. వేరుచేసిన జుట్టును భుజంపై వేసుకుని.. వీడి యోలు తీస్తున్నవారిని బెదిరించి కారులో వెళ్లిపో యాడు. సమాచారం అందడంతో పోలీసులు బాధితురాలిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదుచేశామని ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు.