Friday, November 22, 2024

హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన కమిషనర్

తిరుపతి – రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వివిధ రంగాలలో చేతితో తయారు చేస్తున్న అందరిని ఒక చోట చేర్చి చూడడానికి కాకుండా కావాల్సిన వారికి కొనుక్కోవడానికి కూడా శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుందని తిరుపతి నగరపాలక కమిషనర్ పిఎఫ్ గిరీష అన్నారు. తిరుపతిలోని తిరుచానూర్ రోడ్డు లో గల శిల్పారామంలో శుక్రవారంనాడు ఆయన స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో, హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ను నగరపాలక కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల నుంచి చేతితో తయారు చేసిన వివిధ రకాల దుస్తులు మరియు హ్యాండీక్రాఫ్ట్ లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతితో ఇటువంటి పనులు చేస్తున్నారు అటువంటి వస్తువులన్నిటినీ క్రోడీకరించి ఆయా రాష్ట్రాల నుంచి ఇక్కడికి రప్పించి ఎగ్జిబిషన్ పెట్టించడం చాలా ఆనందకరమైన నాణ్యత కలిగిన ఈ వస్తువులను కొని ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకు వచ్చిన వారిని ఆదరిస్తే వారికి మరింత ఎంకరేజ్మెంట్ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. యంత్రాలతో కాకుండా చేతితో తయారు చేసే వస్తువులను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కమిషనర్ అన్నారు. శిల్పారామంలో ఎగ్జిబిషన్ కం సేల్ 14 రోజుల పాటు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు . ఈ కార్యక్రమం కు కేంద్ర జౌలి మంత్రిత్వశాఖ తో పాటు టూరిజం శాఖ వారు సహాయ సహకారాలు అందించడం గర్వించదగ్గ విషయమన్నారు .
ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు శిల్పారామం సీఈవో జయరాజ్ , టూరిజం శాఖ డి వి ఎం గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement