ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీపీఐ నేత రామకృష్ణ వచ్చారు. అయితే పోలీసులు అయనను అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఛలో విజయవాడకు పిలుపునిస్తే పోలీసులు అడ్డుకున్నారన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఛలో విజయవాడకు పిలుపునిస్తే పోలీసులు అరెస్టులు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా తమ పోరాటం ఆగదని రామకృష్ణ అన్నారు.