Tuesday, November 26, 2024

వైసీపీ పాలన రివర్స్ లో ఉంది: సీపీఐ రామకృష్ణ

వైసీపీ ప్రభుత్వ హయంలో పరిపాలన రివర్స్‌లో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు రాష్ట్రాన్ని దోచేస్తున్నారని, ప్రభుత్వంతో ఒప్పందం అంటేనే  కాంట్రాక్టర్లు భయపడి పోతున్నారని చెప్పారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందన్న ఆయన.. గత రెండేళ్లలో రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు.అర్హులైన వారి పెన్షన్లను ఎందుకు రద్దు చేశారని నిలదీశారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈ నెల 9న విజయవాడలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యుత్ ఛార్జీల పెంపు, రోడ్ల దుస్థితి, పెన్షన్ రద్దుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఈనెల 14న అనంతపురంలో పాదయాత్ర ప్రారంభించి విశాఖలో పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 21న వైజాగ్‌లో విశాఖ ఉక్కుపై భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని రామకృష్ణ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement