Tuesday, November 26, 2024

ఎన్నికల పై జగన్మోహన్ రెడ్డికి నమ్మకం లేదు – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

మారు వేషంలో నామినేషన్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది
పిడిఎఫ్ అభ్యర్థిని గెలిపించండి
కదిరి ఘటన లో సిఐ మధు ను సస్పెండ్ చేయాలి
హోమ్ మినిస్టర్ డిఐజి లు స్పందించాలి

అనంతపురం కార్పొరేషన్ ఫిబ్రవరి 28 (ప్రభ న్యూస్) – ఫోర్జరీ పేరిట ఎలక్షన్స్ ఆఫీసర్స్ నామినేషన్ రద్దు చేస్తున్నార‌ని, వాళ్ల వారిపై సిఎంకు నమ్మకం లేద‌ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ కృష్ణ పేర్కొన్నారు, మంగళవారం నాడు నగరం లోని ఓల్డ్ టౌన్ నందు సీపీఐ కార్యలయం లో పాత్రికేయుల సమావేశం లో మాట్లాడుతూ,. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వై.ఎస్, చంద్రబాబు పోటీ నిర్వహించలేద‌న్నారు. ఆర్జెడీ ప్రతాప్ రెడ్డి తప్పతాగి గొడవ చేస్తే విద్యార్థి సంఘాల పై కేసు పెడుతున్నార‌ని ఆరోపించారు.. ఎన్నిక‌ల కోసం ఏ సిఎం దిగజారనంతగా జగన్ దిగజారారంటూ రామ‌కృష్ణ ఫైర్ అయ్యారు.

కదిరి సిఐ మధు కడప ఎంపి అవినాష్ రెడ్డికి తొత్తుగా మారార‌ని, వైకాపా వాళ్ల మెడలు ఎక్కి సిఐ మధు మీసాలు దువ్వుతున్నార‌ని అన్నారు.. ఇంత జరుగుతున్నా డిజిపి నిద్రపోతున్నారా అంటూ సిఐ మధును సస్పెండ్ చేసి, ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు . నిజాలు రాస్తున్న జర్నలిస్టులపై పెట్టిన‌ కేసులు ఎత్తివేయాలని,లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామ‌న్నారు. కదిరి ఘటనపై వెంటనే హోం మినిస్టర్ డిఐజి స్పందించి సిఐని సస్పెండ్ చేయాలి డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తున్న పిడిఎఫ్ అభ్య‌ర్ధిని గెలిపించాల‌ని కోరారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్. నాయకులు నారాయణస్వామి మల్లికార్జున కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు,

Advertisement

తాజా వార్తలు

Advertisement