Tuesday, November 26, 2024

ఆస్పరి పోలీసులను సస్పెండ్ చేయాలి: సీపీఐ రామకృష్ణ

కర్నూలు జిల్లా ఆస్పరి ఎస్సై మునిప్రతాప్, కానిస్టేబుల్ రామకృష్ణలను సస్పెండ్ చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం సిపిఐ కార్యదర్శి విరుపాక్షపై పోలీసుల దాష్టీకాన్ని ఖండించారు. ఎస్ఐ మునిప్రతాప్ అతని సిబ్బంది వికలాంగుడైన విరూపాక్షను అర్థనగ్నంగా వీధులలో నడిపించి, అతని కుటుంబ సభ్యులను అవమానించి, దౌర్జన్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు గూండాల్లా వ్యవహరించడం తగదన్నారు. సాక్షాత్తు పోలీసులే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటం దుర్మార్గం అని అన్నారు.విరూపాక్షపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement