Saturday, November 23, 2024

పవన్ కళ్యాణ్ పోరాటంపై నమ్మకం లేదు: సీపీఐ నారాయణ..

స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంపై నమ్మకం లేదని తేల్చి చెప్పారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. 222 రోజులుగా మహా ఉద్యమం జరుగుతుంటే మీకు ఇప్పటి వరకు కనిపించలేదా… ఢిల్లీలో ఆందోళనకు వైసీపీ వచ్చింది కానీ మీరు రాలేదు. మీకు ఢిల్లీలో పలుకుబడి వుంది గట్టిగా చెప్పండి….ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అడిగారు. అక్కడకు వెళ్లి కాళ్ళుపట్టుకుని-ఇక్కడ మీసం తిప్పుతావా… ఇక్కడమో బీజేపీతో గుద్దులాట…..అక్కడేమో ముద్దులాటనా అన్నారు.

ప్రజలకు నమ్మకద్రోహం చేయవద్దు….చేతకాకపోతే చేతకాదని చెప్పండి. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకోవడం సాధ్యమే. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అయినా ఆగాలి లేదా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండు నాశనం అయినా అవ్వాలి. విశాఖ స్టీల్, ప్రత్యేక హోదా సాధించలేకపోతే జనానికి ఏం సమాధానం చెబుతారు. అండర్ గ్రౌండ్లో వుండగలిగితే వుండడి….రాజకీయాల్లో ఎక్కువకాలం వుండాలంటే ఖచ్చితంగా పోరాడాల్సిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ఉరిశిక్ష విధించింది. దానిని అడ్దుకునే శక్తి వెంకయ్యనాయుడికి వుంది. దేశ అధ్యక్షుడి తర్వాత స్ధానంలో వున్న వెంకయ్యనాయుడు స్పందించాలి. ఉరిశిక్ష నుంచి స్టీల్ ప్లాంట్ ను కాపాడాలి అని కోరారు.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలి: కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్

Advertisement

తాజా వార్తలు

Advertisement