Friday, November 22, 2024

కోవిషీల్డ్‌ రెండో డోస్ వ్య‌వ‌ధి 12 – 16 వారాలు..

దేశంలో అత్యధిక మందికి వినియో గిస్తున్న కోవిడ్‌-19 టీకా ‘కోవిషీల్డ్‌’ డోసుల మధ్య వ్యత్యాసాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తొలి డోసుకు, రెండవ డోసుకు మధ్య 12-16 వారాల వ్యవధి ఉండాలని డా. ఎన్‌.కే. అరోరా నేతృత్వంలోని కోవిడ్‌ వర్కింగ్‌ గ్రూపు సిఫార్సు చేయగా, నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) డా. వీకే పౌల్‌ నేతృత్వంలోని నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ కోవిడ్‌-19 బుధవారం ఈ సిఫార్సులను ఆమోదం తెలిపింది. అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి కంగా ఈ సిఫార్సులను ఆమోదిస్తూ నిర్ణయం తీసు కుంది. ‘కోవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తొలినా ళ్లలో తొలి డోసుకు, రెండవ డోసుకు మధ్య వ్యత్యాసం 4 వారాలు ఉండేది. అనంతరం ‘కోవిషీల్డ్‌’ రూపకర్త ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా నిర్వ#హంచిన అధ్యయనాల్లో రెండవ డోసు మరికొన్ని వారాలు ఆలస్యంగా వేసిన చోట వ్యాక్సిన్‌ మరింత సమర్థవంతంగా పనిచేసినట్టు తేలింది. వీటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ‘కోవిషీల్డ్‌’ రెండు డోసుల మధ్య వ్యత్యాసాన్ని 6-8 వారాలకు పెంచింది. ఆ తర్వాత యూకే సహా వివిధ దేశాల్లో జరిగిన అధ్య యనాల్లో నిజ జీవిత ఆధారాలను పరిశీలించిన తర్వాత ఈ వ్యవ ధిని మరికొన్నాళ్లు, అంటే 12 నుంచి 16 వారాలకు పెంచాలని కోవిడ్‌-19 వర్కింగ్‌ గ్రూపు భావించింది. అయితే ఈ మార్పు కేవలం కోవిషీల్డ్‌ కు మాత్రమే వర్తిస్తుందని, కోవాగ్జిన్‌ విష యంలో ఎలాంటి మార్పు లేదని వర్కింగ్‌ గ్రూపు స్పష్టం చేసింది. డా. ఎన్‌.కే. అరోరా నేతృత్వంలోని కోవిడ్‌-19 వర్కింగ్‌ గ్రూపులో సభ్యులుగా పుదుచ్ఛేరిలోని జిప్‌మర్‌ డీన్‌, డైరక్టర్‌ డా. రాకేశ్‌ అగర్వాల్‌, వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజి ప్రొఫెసర్‌ డా. గగన్‌దీప్‌ కంగ్‌, అదే కాలేజికి చెందిన విశ్రాంత ప్రొఫెసర్‌ డా. జేపీ ముళ్లియాల్‌, ఢిల్లిలోని జవహర్‌లాల్‌ నెహూ యూనివర్సిటీకి చెందిన ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ బయోటెక్నాలజీ గ్రూప్‌ లీడర్‌ డా. నవీన్‌ ఖన్నా, నేషనల్‌ ఇన్‌స్టి ట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యూనాలజీ డైరక్టర్‌ డా. అమూల్య పాండా, డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా డా. వీజీ సోమానీ ఉన్నారు.
గర్భిణులు, పాలిచ్చే తల్లులకూ టీకా?
‘కోవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ డోసుల మధ్య వ్యత్యాసాన్ని పెంచడంతో పాటు వ్యాక్సినేషన్‌ సంబంధిత అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి మరికొన్ని సిఫార్సులు అందినట్టు తెలుస్తోంది. ‘నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌’ కోవిడ్‌-19 నుంచి కోలుకు న్నవారికి ఎప్పుడు వ్యాక్సిన్‌ ఇవ్వాలన్న విషయంపై సూచనలు చేసినట్టుగా తెలిసింది. కోవిడ్‌-19 నుంచి కోలుకున్నవారికి నెగెటివ్‌ రిపోర్ట్‌ వచ్చిన 2-4 వారాల తర్వాత వ్యాక్సిన్‌ డోసులు అందిస్తున్నారు. అయితే కోవిడ్‌ నుంచి కోలుకున్నవారిలో యాంటీబాడీస్‌ సమృద్ధిగా ఉంటాయని, అవి కనీసం 8 నెలల పాటు శరీరంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని అధ్యయా నాల్లో తేలిన నేపథ్యంలో, కోవిడ్‌ విజేతలు కనీసం 6 నెలల పాటు ఆగిన తర్వాతనే వ్యాక్సిన్‌ తీసుకోవాలని సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే టీకా వేయించుకునే ముందు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టు చేయాల్సిన అవసరం లేదని కూడా సిఫార్సు చేసినట్టు సమాచారం. అలాగే గర్భిణులు, గర్భస్థ శిశువులు కూడా కోవిడ్‌ బారినపడుతున్న ఉదంతాల నేపథ్యంలో గర్భిణులు, పాలిచ్చే తల్లులకు కూడా వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిపు ణుల కమిటీ సిఫార్సు చేసినట్టు సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ‘కోవిషీల్డ్‌’ డోసుల మధ్య దూరం పెంచుతూ తీసుకున్న నిర్ణయం మినహా మిగతా సిఫార్సులపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement