Sunday, November 24, 2024

కొవిడ్‌ బాధిత ఉద్యోగులకు సీఎం జగన్‌ ఔదార్యం.. చనిపోయిన కుటుంబంలో ఒకరికి జాబ్‌ గ్యారంటీ

అమరావతి, ఆంధ్రప్రభ: కోవిడ్‌ కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటు-ంబాల్లోని వారికి వెంటనే కారుణ్య నిమాయకాల కింద ఉద్యోగాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈఏడాది నవంబర్‌ 30 నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌-19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ, కోవిడ్‌ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధినిర్వహణలో అసువులు బాసిన ఉద్యోగులను ప్రభుత్వం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటుందన్నారు. వారు లేని లోటుతో ఆ కుటుంబాలు ఇబ్బం దుల పాలు కాకూడదని ప్రజల మనసెరిగిన ప్రభుత్వంగా తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిం దన్నారు. అధికారులు కూడా ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహ రించి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. జాతీయ ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వ ఆస్ప త్రుల్లో సిబ్బంది నియామకం, జిల్లా ప్రధానకేంద్రాలు, కార్పొరేషన్లలో హెల్త్‌హబ్స్‌ ఏర్పాటు- చేయాలని ఆదేశించారు.

జాతీయ ప్రమాణాలను అనుస రించి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్ప త్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల్లో సిబ్బంది నియామకం కూడా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ ఆస్ప త్రుల్లో గుర్తించిన ఖాళీలు, అవసరాల మేరకు నియామకాల క్యాలెండర్‌ను రూపొందించామని అధికారులు సీఎంకు తెలిపారు. అక్టోబరు 20న పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు జారీచేస్తామని పేర్కొన్నారు. డీపీహెచ్‌ఎఫ్‌డబ్ల్యూ లో పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 20న నోటిఫికేషన్‌ ఇస్తామని, ఎంపిక ప్రక్రియను పూరి ్తచేసుకుని డిసెంబర్‌ 10న నియామక ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించారు. డీఎంఈలో పోస్టులకు సంబంధించి అక్టోబరు 20న నోటిఫికేషన్‌ జారీచేస్తామని, ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి డిసెం బర్‌ 5న నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికా రులు సీఎంకు వివరించారు. ఏపీవీవీపీలో పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబరు 20 నుంచి 23 వరకూ నోటిఫికేషన్లు జారీచేస్తామని, ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి డిసెంబర్‌ 21 -25 మధ్య నియామక ఉత్తర్వులు ఇస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

రాజీపడొద్దు
జాతీయ ప్రమాణాలను అనుసరించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది ఉండాలని, ఇందులో రాజీకి ఆస్కారం లేదని ఆయన మరోమారు పునరుద్ఘాటించారు. కొత్తగా నిర్మించదలిచిన 176 పీహెచ్‌సీల నిర్మాణంపై వెంటనే దృష్టిపెట్టాలన్నారు. ఈ సందర్భంగా జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లోగా పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement