Friday, November 22, 2024

Couple Suicide : అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య

అప్పుల బాధ‌తో దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. బ్రతుకు తెరువు కోసం ఆక్వాకల్చర్‌పై ఆదారపడ్డ దంపతులకు అప్పులు ఎక్కువై తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాకు చెంది నాగబాబు(30), అనూష(28) దంపతులు. ఇటీవల ఆక్వాసాగులో నష్టం రావడంతో అప్పుల పాలయ్యారు.

దీంతో అప్పులు తీర్చలేక చనిపోతున్నట్లు ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆక్వా సాగులో నష్టం వచ్చిందని, అప్పులు ఎక్కువ తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ నోట్‌లో దంపతులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement