విశాఖ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దంపతులు బలవన్మరానికి పాల్పడ్డారు. పెందుర్తి మండలం పురుషోత్తం గ్రామానికి చెందిన భార్యభర్తలు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులు మరీ ఎక్కువ కావడంతో రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు సంతోష్, ఉష శ్రీ.
సంతోష్, ఉషశ్రీ ఆత్మహత్యలకు ఆర్థిక బాధలే కారణమని భావిస్తున్నారు పోలీసులు. కొత్త సంవత్సరంలో దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో రోధిస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -