Wednesday, December 4, 2024

Counting Effect – ఎపిలో మూడు రోజుల పాటు మ‌ద్యం బంద్

కౌంటింగ్ సంద‌ర్భంగా ఎపిలో మూడు రోజుల పాటు మ‌ద్యం షాపులు మూత ప‌డ‌నున్నాయి.. ఈ మేర‌కు డిజిపి హరీష్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు.. ఈ నెల మూడు,నాలుగు, అయిదు తేదీల‌లో ఎపిలోని ప్రాంతాల‌లోని మ‌ద్యం షాపులు మూసివేయాల‌ని కోరారు..ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీశ్ గుప్తా వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని కింద స్థాయి అధికారుల‌కు ఆయ‌న ఆదేశాలు ఇచ్చారు.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ చిన్న అవాంచ‌నీయ సంఘ‌ట‌న జ‌రిగినా 100కి ఫోన్ చేసి చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement