కర్నూలు.. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్ రెడ్డి కి సంబంధం ఉంటే అవకాశాలు లేవని వివేకా సోదరి విమలారెడ్డి అన్నారు..విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని వివేకా సోదరి విమలారెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్బంగానే అక్కడే ఉన్నఅవినాష్ రెడ్డిని కలిశారు.. అన్నిసమస్యలు త్వరలోనే తీరతాయంటూ అవినాష్ రెడ్డికి విమలారెడ్డి దైర్యం చెప్పారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, వివేకాను హత్య చేసిన వారు బయట తిరుగుతున్నారన్నారు.. ..తప్పు చేయని వారిని జైల్లో పెడుతున్నారని ఆరోపించారు…ఎంపి అవినాష్ రెడ్డి ని టార్గెట్ చేసి వేధిస్తున్నారని మండిపడ్డారు.. తన కుటుంబం ఎవరినీ హత్య చేయలేదని మొదట సునీత చెప్పారని ఆ తర్వాత సునీత మాట మార్చారన్నారు.. తప్పు అని చెప్పినందుకే సునీత తమతో మాట్లాడడం లేదని పేర్కొన్నారు..
Counter – ఆ హత్యతో అవినాష్ సంబంధం లేదు – వివేకా సోదరి విమలారెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement