నిర్లక్ష్యంతోనే ఘటన
దైవ సేవ కంటే నేతల సేవలతోనే ఈ దుస్థితి
పాలక మండలి వైఫల్యంతోనే భక్తుల మరణం
సనాతన యోధుడు ప్రాయశ్చితం చేసుకోవాలి
చంద్రబాబును రాజీనామా చేయాలని పవన్ కోరాలి
ఘటన భాద్యులైన వారందర్ని లోపలేయాల్సిందే
తిరుపతి – తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం జరిగిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ ఘటన కు కారణమెవరో కనుక్కోకుండా నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.. అధికారులను, టీటీడీ బోర్డును ఎవరు పెట్టారని ప్రశ్నించారు.. భక్తులకు సర్వీస్ చేయాలన్న ఉద్దేశ్యం ఎవరికి లేదన్నారు.. అధికారులు చంద్రబాబు దగ్గర భజన చేస్తూ తిరుగుతూ భక్తులను గాలికి వదిలేశారని విమర్శించారు.. గత ఏడాది వైసీపీ హయాంలో ఎలా చేశామో అందరూ చూశారన్నారు.
నిర్లక్ష్యమే… అందర్ని లోపలేయాల్సిందే ..
తిరుపతిలో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, “భక్తులకు కనీస సదుపాయాలు లేవు.. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదు.. ప్రభుత్వం చేసిన హత్యలు.. తెలంగాణలో చూసాం.. ఓ ఘటనలో మహిళ చనిపోతే అల్లు అర్జున్ పై కేసు పెట్టారు.. ఈ ఘటనలో చంద్రబాబు నుంచి క్రింది స్థాయి అధికారులు బాధ్యత వహించాలి.. ఘటనను ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలా కేసులు నమోదు చేశారు.. విజయవాడ హైందవ శంఖారావంలో చెప్పారు.. హిందువులను కాపాడాలని చెప్పారు.. ఇప్పుడు ఆ పీఠాధిపతులు ఏమయ్యారు.. తిరుమల లడ్డుపై బీజేపీ, టీడీపీ నేతలు ఎన్ని మాట్లాడారో అందరూ చూశారు.. మీరు చేస్తే కరెక్టు.. మరొకరు చేస్తే తప్పు అన్నట్లు చేస్తున్నారు.. ప్రధాని మోడీకి ఒకటే విజ్ఞాపన చేస్తున్నా.. బాధ్యులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు..
పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు…
“సనాతన యోధుడు ఈ ఘటనకు ఏ ప్రాయశ్చిత్తం చేస్తారు.. చంద్రబాబుతో రాజీనామా చేయిస్తారా.. మీరు చేస్తారా..? అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు రోజా.. హోం మంత్రి కేవలం ఇతరులను తిట్టడానికి తప్ప లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయటానికి పనికి రావటం లేదన్నారు .. తొక్కిసలాటకు కారణమైన బాధ్యుతలపై క్రిమినల్ కేసులుపెట్టి లోపలేయాలని కోరారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల గోదావరి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఘటనకు నిర్లక్ష్యం కారణం కాదని, ప్రభుత్వం చేసిన హత్యలంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు వైఫల్యం, అసమర్దత వల్లే ఇంతమంది చనిపోయారు. అని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు.