మచిలీపట్నం, నవంబర్ 25( ప్రభన్యూస్): విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై మాజీ మంత్రి, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య( నాని) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మచిలీపట్నంలో పాత్రికేయులతో మాట్లాడుతూ విశాఖ ఫిషింగ్ హార్బర్ ఫైర్ యాక్సిడెంట్ ని పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నాడని ద్వజమెత్తారు.ప్రమాదం జరిగిన వెంటనే సీఎం జగన్ స్పందించడంతోపాటు బాధిత బోటు యజమానులకు పరిహారం అందించారన్నారు.దీన్ని జీర్ణించుకోలేని పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై విషం కక్కుతున్నాడని మండిపడ్డారు. బాధితులకు రూ. 7.19 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేసిందన్నారు. పవన్ దగా కోరు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు
. అగ్ని ప్రమాదంలో బోట్లకు జరిగిన నష్టం పై, రెవిన్యూ, మత్స్యశాఖ, తదితర అధికారులు అంచనాల రూపొందించి దానికి అనుగుణంగా బాధితులకు పరిహారం అందజేసినట్లు వివరించారు. జరిగిన నష్టానికి అనుగుణంగా రూ.15 లక్షల నుంచి రూ.32 లక్షల వరకు పరిహారం అందించినట్లు తెలిపారు. మత్స్యకారులు వేట సందర్భంగా ప్రమాదవశాత్తు చనిపోతే ఎటువంటి పరిహారం అందించడం లేదని పవన్ కళ్యాణ్ మోసపు మాటలు చెబుతున్నారని ఆరోపించారు. మత్స్యకారులు చనిపోతే ప్రభుత్వం రూ.10 లక్షలు చెల్లిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు 159 మందికి పరిహారం అందిస్తే, మరో 32 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. దగా మాటలు, సినిమా డైలాగు లతో జగన్మోహన్ రెడ్డి పై విషం కుమ్మరిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం చంద్రబాబు నాయుడిని అధికారంలోకి తీసుకురావాలని ఏకైక లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని ఆరోపించారు. వావి వరసలు లేని రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు
V.