Friday, November 22, 2024

Counter – చంద్రబాబు హయాంలోనే డిస్టలరీలకు అనుమతులు… పురందేశ్వరికి మంత్రి పెద్దిరెడ్డి క్లాస్

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో. – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. విజయవాడలోని కనకదుర్గానగర్ లో ఆదివారం మూడు ఇండోర్ సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
మద్యం పాలసీపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి వాఖ్యలను ఖండించారు. ఈ రాష్ట్రంలో అన్ని మద్యం తయారీ డిస్టలరీలకు చంద్రబాబు హయాంలోనే అనుమతులు ఇచ్చారని తెలిపారు. సీఎం వైయస్ జగన్ హయాంలో ఒక్క డిస్టలరీకి కూడా అనుమతులు ఇవ్వలేని స్పష్టం చేశారు. అది కూడా తెలియకుండానే పురందరేశ్వరి మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. ఇదే విషయంలో వైయస్ఆర్ సిపి ఎంపి విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పురందరేశ్వరి బిజెపి రాష్ట్ర అధ్యక్షరాలిగా కాకుండా తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడుతున్నారు. ఆమె తెలుగుదేశం పార్టీ తరుఫున వకాల్తా పుచ్చుకున్నారు. ఆమె వైఖరిని బిజెపి నేతలే తప్పుపడుతున్నారు. చిత్తూరుజిల్లా బిజెపి అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి తాజాగా పురందరేశ్వరి వైఖరిపై చేసిన విమర్శలు అందరూ చూశారు. పురందరేశ్వరీ బిజెపి నేతగా కాకుండా చంద్రబాబు వదినగా పనిచేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూనే తెలుగుదేశం కోసం పనిచేయడాన్ని అందరూ గర్హిస్తున్నారు

.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, తూర్పు నియోజకవర్గ వైయస్ఆర్ సిపి ఇన్ చార్జి దేవినేని అవినాశ్, కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్, పుండ్కర్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement