Thursday, October 10, 2024

Coundown కౌంటింగ్‌కు ఇటు రెవెన్యూ.. అటు పోలీసులు సిద్ధం…

.

ఆంధ్ర.ప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి – -ఏపీలో ఓట్ల లెక్కింపులో ప్రప్రథమంగా ఈవీఎంల నుంచే తొలి రౌండ్‌ ఫలితమే ముందుగా వెలువడుతుందని అధికారులు చెప్తున్నారు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కింపు అరగంట ముందే ప్రారంభమౌతుందని, దీనివల్ల వాటి ఫలితాలే ముందు వస్తాయని చాలామంది అపోహలకు గురౌతున్నారు. అది నిజం కాదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈవీఎంల లెక్కింపు కంటే అరగంట ముందుగా పోస్టల్‌బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. ఉద్యోగులు, దివ్యాంగులు, 85 ఏళ్ల వయస్సు దాటి ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ స్థితిలో బ్యాలెట్ల లెక్కింపు ఆలస్యమవుతుంది.

పోస్ట‌ల్ బ్యాలెట్లు లేనిచోట‌..పోస్టల్ బ్యాలెట్ లేని చోట 8 గంటలకే ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది.పోస్టల్ బ్యాలెట్ టేబుల్‌పై ఏఅర్‌వో, కౌంటింగ్ సూపర్ వైజర్‌లు ఉంటారు. 111 అసెంబ్లీ నియోజకవర్గాలలో 20 రౌండ్‌లు ఉంటాయి. 5 గంటల్లో ఫలితం వెలువడుతుంది. 61 అసెంబ్లీ నియోజకవర్గాలలో 21 నుంచి 24 రౌండ్‌లు ఉంటాయి. 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 అంతకన్నా ఎక్కువ రౌండ్‌లు ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్ల లెక్కింపునకు 350 హాల్స్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 75 హాల్స్ ఏర్పాటు చేశారు.

- Advertisement -

కౌంటింగ్ కేంద్రాల్లో ఆంక్షలు పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్లో వైసీపీ, కూటమి మధ్య పేచీ తీవ్ర స్థాయికి చేరటంతో.. లెక్కింపు కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా అటు రెవెన్యూ, ఇటు పోలీసు యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. మూడు రోజుల పాటు మద్య విక్రయాలను నిషేధించింది. అలాగే కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజెంట్లను బ్రీత్ ఎన్ లైజర్లతో చెక్ చేస్తారు.

. మద్యం సేవించిన వ్యక్తులు వెనక్కి పంపిస్తారు. ఇక గొడవ పడితే వెంటనే కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లగొట్టటమే కాదు, పోలీసు కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు. పోలీస్ .. పోలీస్మునుపెన్నడూ లేని రీతిలో ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ కనిపిస్తోంది. శాంత్రి భద్రతలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏపీలో ఆదివారం నుంచే అంతటా 144 సెక్షన్ అమలులో ఉంది.కౌంటింగ్ కేంద్రానికి కిలోమీటరు పరిధిని రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇక అనంతపురం, తాడిపత్రి, మాచర్ల, నర్సారావుపేట, గురజాల తదితర ప్రాంతాలన్నీ అనంతపురం, పల్నాడు ఎస్పీల ఆధీనంలోకి వచ్చేశాయి.

కౌంటింగ్సందర్భంగాఏమాత్రంఅలజడిసృష్టించినాతాటతీస్తామనిఅటుఅనంతపురంఎస్పీ గౌతమి, పల్నాడు ఎస్పీ మలికా గార్గ్వార్నింగ్ ఇచ్చారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు..ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పలుచోట్ల రౌడీషీటర్స్, ట్రబుల్ మంగ్ల్ యాక్టివిటీస్ కలిగిన వారికి తగు హెచ్చరికలు జారీ చేశారు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడానికి లేకుండా పటిష్టమైన భద్రతా బలగాలను మోహరించారు. ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్న వెంటనే తదుపరి ఆదేశాలకు ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటుచేశారు.

ఆగమేఘాలపై అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వులు అందచేసే విధంగా మానిటరింగ్ బృందాలతో నిరంతర నిఘా పెట్టారు. సెక్షన్ 40, 144 అమలులో ఉన్నందున ముగ్గురికి మించి రోడ్లపై కలిసి ఉండటం నిషేధం. విజయోత్సవం చేయటంతో పాటుగా బాణాసంచా కాల్చడం కూడా నిషేధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement