Tuesday, November 26, 2024

బోర్డర్ జిల్లాల్లో కుటీర పరిశ్రమ.. గుప్పుమంటున్న నాటుసారా..

పార్వతీపురం, (ప్రభ న్యూస్‌) : పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ నాటుసారా పార్వతీపురం నియోజకవర్గంలో ఏరులై పారుతోంది. నాటుసారా అక్రమరవాణా చేసే అక్రమార్కులకు ఒడిస్సా – ఆంధ్ర రాష్ట్రాల మధ్య అడ్డదారుల గుండా వ్యాపారం చేసుకొని మూడు పువ్వులు ఆరు కాయలుగా దర్జాగా బతుకుతున్నారు. నాటుసారా తాగితే ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా అలవాటుపడిన జనం అటువైపు మొగ్గు చూపుతున్నారు. అక్రమ వ్యాపారం చేస్తున్న వారిలో 80 శాతం వరకు యువత కనిపిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా సారా అక్రమరవాణా చేస్తూనే ఉన్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడంతో ఆశాఖలో కొంతమంది సిబ్బంది నాటుసారా అక్రమార్కులతో చేయి కలిపి పై అధికారులు దాడులు నిర్వహణపై సమాచారం అందించి అక్రమార్కులకు సహాయ పడుతున్నట్టు బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి.

గతంలో గాలికి తిరిగి వారంతా సులువైన సంపాదనకు అలవాటుపడి లక్షలు సంపాదిస్తూ దర్జాగా బతుకుతున్నారు. అక్రమార్కుల దౌర్జన్యాలకు అడ్డుకట్ట వెయ్యరు సరికదా.. అధికార సిబ్బంది లంచాలకు అలవాటుపడి నియంత్రించ లేకపోతున్నారు.. అక్రమంగా తరలిస్తున్న వారి నుంచి ఎక్సైజ్‌ శాఖ అధికారులు రూ. 5 నుంచి 10వేలు వరకు లంఛాలు తీసుకుంటున్నారని తెలిసింది. అలాగే సారా అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులు సంబంధిత అధికారులకు పట్టుబడితే రూ.20 నుంచి 25వేలు వరకు సెటిల్‌ చేసుకొని కేసులు లేకుండా బయట పడుతున్నారు. పార్వతీపురం ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ ఇటీవల కాలంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులతో సమావేశమై సారా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. సారా మహమ్మారి నియంత్రణ కోసం ప్రతీ రోజూ పత్రికలు గోషిస్తున్నప్పటికీ లంచాలకు అలవాటు పడిన అధికార సిబ్బంది కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి..

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ ఉపేందర్‌ను వివరణ కోరగా: మేము సాయశక్తులా సారాపై దాడులు చేసి పట్టుకుంటున్నాం. నాకు సంబంధించి సిబ్బంది ఎటువంటి అవినీతికి పాల్పడిన ఉపేక్షించేది లేదు. సిబ్బంది చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఉన్నవారు వయసు దాటిన వారు అందుకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎక్స్చేంజ్‌ కార్యాలయం బొబ్బిలికి తరలించడం వలన మరి ఇబ్బందిగా ఉంది..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement