Wednesday, December 18, 2024

AP | అవినీతి.. కుట్రతో పోలవరం నాశనం.. సీఎం చంద్ర‌బాబు

  • డ్యామేజీ పనుల్ని మళ్లీ చేయక తప్పటం లేదు
  • రూ.2400 కోట్లు అదనపు ఖర్చు
  • అయిదేళ్లలో 3.4శాతం పనులే చేశారు
  • రూ.2,340 కోట్లు దారిమళ్లాయి
  • రూ.2000 కోట్ల పనులు ఆగిపోయాయి
  • 2026 మే నాటికి పనులు పూర్తి చేయాలి
  • ప్రస్తుతం రూ.12,157 కోట్లు మంజూరు
  • రూ.2300 కోట్లు విడుదల చేశారు
  • 16,400 ఎకరాల భూమి అవసరం
  • 2026 నాటికి ఆర్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేస్తాం
  • పోలవరంలో చంద్రబాబు


( ఆంధ్రప్రభ స్మార్ట్, ఏలూరు బ్యూరో) : అసమర్థత, అవగాహన రాహిత్యం, అవినీతి, కుట్రతో పోలవరాన్ని నాశనం చేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో సోమవారం ఆయన పర్యటిస్తున్నారు. తొలుత పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ హెలిపాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనుల గురించి అధికారులు వివరించారు. పోలవరం పనులపై అధికారులు, ఇంజినీర్లతో చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ… అప్పర్, లోయర్ కాపర్ డ్యామ్, డ్రమాఫ్రమ్ పనులను పరిశీలించామని, 2020లో వరద ఉదృతితో ఇవన్నీ దెబ్బతిన్నాయన్నారు. నిర్మాణాల కింద మట్టి కోతకు గురి కావటంతో 200మీటర్లలో మట్టి దెబ్బతిందని వివరించారు.

ఇప్పుడు ఇసుక తెచ్చి హైడ్రో కాంప్రెషన్ చేస్తున్నామని, ఈ పనులకు రూ. 2400కోట్లు అదనంగా ఖర్చవుతోందన్నారు. కొత్త డయాఫ్రం పనులకు రూ.950 కోట్లు ఖర్చు అవుతోందని, పాత డ్రయాఫ్రంను రూ. 450 కోట్లుతో పూర్తి చేశామన్నారు. , శాండ్ ఫిల్లింగ్ కు రూ.360 కోట్లు, డీ వాటరింగ్ కు రూ. 211కోట్లు ఖర్చు అవుతోందన్నారు. ఇక నిర్మాణ ఖర్చులూ పెరుగుతున్నాయన్నారు. కాస్ట్ సిమెంట్ రేట్లు , లేబర్ ఖర్చులు పెరిగాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.. 8,242 కోట్లు ఇస్తే రూ. 2,340 కోట్లు దారి మళ్లించారని, రూ. 2000 కోట్ల పనులు నిలిపి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. .తాము 70 శాతం పనులు పూర్తి చేస్తే గత ప్రభుత్వం కేవలం 3.84 శాతం పనులే చేసిందన్నారు. ఇక కాలువ ల పనులు జరగాలన్నారు. అంతర్జాతీయ నిపుణుల నివేదిక ప్రకారం ప్రధానికి, ఆర్థిక మంత్రిని నిధులు పెంచాలని అభ్యర్థించామన్నారు.

ఇప్పటి వరకూ ఫేజ్వన్ పనులు లేవు. కానీ త్వరిత గతిన అంచెల వారీగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించిందని, రూ.12,157 కోట్లు మంజూరు చేసి రూ. 2300 కోట్లు విడుదల చేసిందని సీఎం చంద్రబాబు వివరించారు. వర్క్ స్పీడ్ పెంచటానికి పోలవరం ఎడమ కాలువ పనులు ప్రారంభించేందుకు అనకాపల్లి వరకూ టెండర్లు పిలిచామన్నారు. అప్రోచ్ రోడ్ల పనులు, డీవాటరింగ్ పనులు చేస్తామన్నారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ పనులను పక్ వర్క్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ పనులను జనవరి 2న ప్రారంభిస్తామన్నారు. ఈసీఆర్ గ్యాప్ 1, ఈసీఆర్ గ్యాప్ 2 పనులను 2026 మే జూన్ లోపు చేస్తే.. మంచిదన్నారు. కుడికాలువ, ఎడమ కాలువ పనుల ఏడాదిన్నర లోపు పూర్తి చేయాలన్నారు. అప్రోచ్ పనులన్నీ.. స్పిల్ చానల్, పైలట్ చానల్ పనులు, రెగ్యులేటర్ పనులను 2027 ప్రిబ్రవరి నాటికి పూర్తి చేయాలన్నారు. ఈ పనులకు 16,400 ఎకరాల భూమిని సేకరించాలని, భూసేకరణను 2025 ఏప్రిల్ నాటికి.. ఆర్ ఆర్ ప్యాకేజీని 2026 నాటికి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

- Advertisement -

ఇది ఏపీకి జీవనాడి…
పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని సీఎం చంద్రబాబు తెలిపారు. పోలవరం వల్ల 7.20 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు ఉందని తెలిపారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఉందని తెలిపారు. పోలవరం, అమరావతి రెండు కళ్లు అని చెప్పారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే ఏపీకి గేమ్‌ ఛేంజర్‌గా తయారువుతుందని చెప్పారు. పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి అనుసంధానం చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే ఏపీకి గేమ్‌ ఛేంజర్‌గా తయారువుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.

పట్టిసీమతో కృష్ణానదికి అనుసంధానం..
పట్టిసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం చేశాం. త్వరలో నేరుగా కృష్ణా నుంచి సాగర్‌ కెనాల్‌కు పూర్తి చేయాలి. గొల్లాపల్లి రిజర్వాయర్‌ వస్తే మనకు ఇబ్బంది ఉండదు.వెలిగొండ ఇరిగేషన్‌కు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లొచ్చు. విశాఖకు తరలిస్తూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధారకు నీళ్లు.. ఇది పూర్తి చేయగలిగితే అన్ని జిల్లాలకు ఎంతో ఉపయోగం. శ్రీకాకుళం నుంచి కర్నూలు, నెల్లూరు, తిరుపతి వరకు నీటి సమస్య ఉండదు. ప్రాజెక్టు ప్రాముఖ్యత చూస్తే 50 లక్షల క్యూసెక్కులు డిశ్చార్జ్‌ చేసే సామర్ధ్యం. 93 మీటర్లు డయా ఫ్రం వాల్‌ అత్యంత ఎత్తైన స్పిల్‌ వే గేట్లు ఉంటుంది. బహుళ ప్రయోజనాల కోసం వినియోగించే ప్రాజెక్టు పోలవరం’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement