Saturday, November 16, 2024

స్వధార్‌ గృహ్‌ పధకం – అక్ర‌మాల‌కు నిల‌యం..

అమరావతి, ఆంధ్రప్రభ: వివిధ కారణాల వల్ల కుటుం బానికి దూరమై ఆదరణ కరువైన వారి కోసం ప్రభుత్వం వసతి గృహాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా అనాధలైన మహిళలు, పిల్లలు, ట్రాఫికింగ్‌ నుంచి విముక్తి లభించిన యువతులు, ప్రత్యేక వికలాంగులు, సీనియర్‌ సిటిజన్‌లు, మాదకద్రవ్యాలకు బానిసలు, యాచకులు, నిరాశ్రయుల కోసం ఆశ్రయం కల్పించడమే వీటి లక్ష్యం. వైద్యం, భోజనం, రక్షణ, కనీస సౌకర్యాలతోపాటు సామాజిక భద్రత అందిం చాల్సి ఉంది. ఈ తరహా మహిళా, శిశు గృహాలు, సంరక్షణ కేంద్రాలను ప్రభుత్వంతోపాటు స్వచ్చంద సంస్ధలు కూడా నిర్వహిస్తున్నాయి. ఆయా తరహా కేంద్రాలను నిర్వహించేం దుకు ముందుకు వచ్చిన ఎన్‌జీఓలకు నిబంధనలక నుగు ణంగా ప్రభుత్వం అనుమతులు తప్ప నిసరి.
కాగా ఈ మహి ళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి న స్వధార్‌ గృహ్‌ పధకం కింద వీరికి చేయూ తనివ్వడం జరుగుతోంది. మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ పర్యవేక్షణలో కొనసాగే ఈ గృహాల నిర్వహణ కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే మార్గదర్శకాలు జారీ చేసింది.

దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం అజమాయషీ, నిధులతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అధికంగా ఆర్ధిక చేయూత లభిస్తోంది. అయితే రాష్ట్రంలోని చాలావరకు ఆనాధ ఆశ్రమాలు, మహిళా, శిశు గృహాలు నిబంధనలు పాటించకపోవడం తోపాటు శరణాలయాల అల నాపాలనా దారుణ పరిస్ధితులను ఎదుర్కొంటున్నట్లు గత కొద్దిరోజు లుగా ప్రభుత్వానికి ఫిర్యా దులు అందుతున్నాయి. స్వధార్‌ గృహ్‌ కింద అందు తున్న నిధులు కైంకర్యం చేస్తూ శరణార్ధుల సంక్షేమాన్ని గాలికొదిలే శారన్న ఆరోపణలు ఉన్నాయి. నిధుల దుర్విని యాగంతో పాటు శరణాలయాల నిర్వహణ లోపభూ యిష్టంగా ఉందనే ఫిర్యాదులు నేరుగా ప్రభుత్వం దృష్టికి రావడంతో సర్కార్‌ ఆదేశాలతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ రంగంలోకి దిగింది. విజిలెన్స్‌ డీజీ శంక భ్రత బాగ్చీ ఆదేశాలతో ప్రాధమిక విచారణ చేపట్టిన అధికారులు భోజనం, వసతి, వైద్యం, రక్షణ, మౌళిక సౌకర్యాల కల్పనలో రాష్ట్రంలోని చాలా గృహాలు విఫలం చెందినట్లు నిర్ధారిం చారు. ఈ నేపధ్యం లో విజిలెన్స్‌ బృందాలు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని శరణాలయాలు, గృహాలపై దాడులు నిర్వహించారు.

అక్రమాలు ఇవే..
చాలా గృహాలు స్వధార్‌ గృహ్‌ పధకం నిబంధనల క నుగుణంగా నడవడం లేదు. ముఖ్యంగా శరణార్ధుల సంఖ్యకు తగిన విధంగా వసతి లేకపోవడం, గదులు కేటాయింపు లేదు. అదేవిధంగా గృహాలు, ఆశ్రమాల్లో ఉండే మహిళలు, పిల్లల భద్రతకు సంబంధించి రక్షణ చర్యల జాడే లేదు. రూల్స్‌ ప్రకారం సెక్యూరిటీ సిబ్బంది నియామకం, కాంపౌండ్‌ నిర్మా ణం లేకపోవడం, వైద్య సిబ్బంది కానరాకపోవడం వంటి అంశాలు విజిలెన్స్‌ తనిఖీల్లో వెలుగు చూశాయి. ప్రస్తుతం వేసవిని పురస్కరిం చుకుని అనుకోకుండా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే భారీ ప్రాణనష్టం జరిగే పరిస్ధితిపై అధికా రులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి సందర్భంలో తగిన అగ్నిమాపక పరికరాలు, జాగ్రత్త చర్యలు శూన్యం. అడ్మిషన్‌ రిజిస్టర్లు, డిశ్చార్జి రిజిస్టర్లు, డొనేషన్‌ రిజిస్టర్లు, ఆస్తుల రిజిస్టర్లు, నగదు రిజిస్టర్లు, స్టాక్‌ రిజిస్టర్లు నిర్వహణలో అంతులేని అక్రమాలు, అవినీతిని విజిలెన్స్‌ బృందాలు గుర్తించాయి. దాదాపు అన్ని చోట్లా రిజిస్ట్రేషన్‌ గడువు ముగిసినా పునరుద్ధరించక పోవడం గమనార్హం. చాలా సంవత్సరా లుగా ఖాతాల రెగ్యులర్‌ ఆడిట్‌ నిర్వహిం చ కపోవడం బట్టబయలైంది. ఇక ఆశ్రయం పొందుతున్న వారికి మౌళిక సౌకర్యాల విషయానికొస్తే సరైన డ్రైనేజీ, మరుగుదొడ్లు లేకపోవడం, వంటగది, భోజన గది, శరణా ర్ధులకు సరైన మంచం, దుప్పట్లు లేకపోవడం వంటి అంశాలు గృహాలు నిర్వహణ దుస్ధితికి అద్దం పడుతోంది. అనేక చోట్ల భవనాలు శిధిలావస్ధకు చేరుకుంటే.. అద్దె భవనాలు మరమ్మ తులకు సిద్ధంగా ఉన్నాయి. భ ద్రత కోసం సీసీ కెమేరాల జాడే లేదు. సామాజిక కార్యకర్తలు, క్లినికల్‌ సైకాలజిస్టులు హాజరు, సంబంధిత శాఖల పర్యవేక్షణ లేకపోవడం వంటి వైఫల్యాలను అధికారులు నిగ్గు తేల్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement