Monday, November 18, 2024

మెడికల్ షాపు లోనే కరోనా టెస్ట్ లు, వైద్యం

… అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న దృశ్యం.
… మామూళ్ల మత్తులో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారనే ఆరోపణలు.

కొత్తపల్లి – నిరక్షరాస్యుల అమాయకత్వమే ఆ మెడికల్ షాపు యజమానికి కాసుల పంట కురిపిస్తుంది. కానీ ఆ అమాయకులు సరైన అవగాహన లేక అర్హత లేని వ్యక్తి చేసే టెస్టుల రిజల్ట్స్ నిజమని నమ్మి భయాందోళనలకు గురి కావడమే కాకుండా డబ్బులను పోగొట్టుకోవడం తో పాటు వారి జీవితాలను పణంగా పెడుతున్నారు. ఇలాంటి వాటిని నిరోధించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సదరు వ్యక్తికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. కరోనా మహమ్మారి అమాయకుల పాలిట శాపంగానూ సదరు మెడికల్ షాపు యజమానికి బంగారు కోడి పెట్ట గాను మారింది. వివరాలలోకి వెళ్తే యు. కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఎక్కువగా నిరక్ష రాశులు, మత్స్యకారులు కూడా. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి భయాందోళనల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు కొద్దిపాటి జ్వరం లేదా జలుబు లేదా ఒళ్లు నొప్పులు వంటివి వస్తే భయాందోళనలకు గురై ఉప్పాడ సెంటర్లో ఉన్న ఒక మెడికల్ షాపుకు వెళ్ళటం జరుగుతుంది. అయితే సదరు షాపు యజమాని ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడే కరోనా టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చినా రాకపోయినా పాజిటివ్ అని చెప్పి వైద్యం పేరుతో వేలాది రూపాయలు దోచుకుంటున్నారు. సదరు షాపు యజమాని ప్రతి నెల సంబంధిత డ్రగ్ ఇన్స్పెక్టర్ కు మామూళ్లతో పాటు చేపలు, రొయ్యలు బహుమానంగా ఇస్తుండడంతో నే అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా కరోనా టెస్టులు నిర్వహించడమే కాకుండా కరోనా వైద్యం చేస్తూ అమాయకుల జీవితాలతో ఆడుకోవడమే కాకుండా వారి నుండి ఆర్ధిక దోపిడీ చేస్తున్న మెడికల్ షాపు యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement