Tuesday, November 26, 2024

కృష్ణపట్నంకు కరోనా బాధితులు.. జీజీహెచ్ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ!

కరోనాకు ఉచితంగా ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారన్న విషయం తెలుసుకుని నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంకు ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు. నెల్లూరు జీజీహెచ్ లో ఒక వార్డులో ఉన్న కరోనా రోగులు కూడా కృష్ణపట్నం ఆనందయ్య దగ్గర ఆయుర్వేదం మందు కోసం హాస్పిటల్ ఖాళీ చేసి వెళ్లారు. ఇవాళ పాజిటివ్ రోగులకే మందు పంపిణీ చేస్తామని నిర్వహకులు చెప్పడంలో ఆస్పత్రిలోని కరోనా బాధితులు కష్టపట్నంకు క్యూ కట్టారు.  దీంతో నిన్న మొన్నటి వరకు బెడ్ల నిండిపోయి కిటకిటలాడిన ఆస్పత్రిలో ప్రస్తుతం బెడ్లు ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.

 ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. అయితే మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. దీంతో శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ మందు కోసం ఇతర జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలి వచ్చారు.

మరోవైపు ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ వద్ద గందరగోళం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఒక్కసారిగా వేల మంది రావడంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కొద్ది మందికి మాత్రమే మందు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ నివేదిక అనంతరం తేదీలని ప్రకటిస్తామని, అప్పటి వరకు పంపిణీని నిలిపేస్తామని చెప్పారు.

ఇదిఇలా ఉంటే.. కృష్ణపట్నం నుంచి 3 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది ఎక్కడికక్కడ వాహనాలు నుంచి పోతున్నాయి. చివరకు మీడియా వాహనాలు కూడా ట్రాఫిక్ లో చిక్కుకుని పోయాయి. ఇప్పటివరకు 50 నుంచి 60 వేల మంది జనం వస్తారని ఇంటలిజెన్స్ అంచనాలు వేస్తున్నారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: ఆనందయ్య ఆయుర్వేద మందు… కృష్ణపట్నం క్యూ కట్టిన ప్రజలు

Advertisement

తాజా వార్తలు

Advertisement