కృష్ణా జిల్లాలోని గన్నవరం సబ్ జైలులో కరోనా కలకలం చెలరేగింది. సబ్ జైల్లో దాదాపు 18మంది ఖైదీలుండగా, 30 మంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారు. ఒక చోరీ కేసులో రిమాండ్ విధించిన ఖైదీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. కరోనా సోకిన వ్యక్తి పేరు సిరిగిరి చంద్రశేఖర్ గా గుర్తించారు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించనున్నట్టు సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement