అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేసులు స్వల్పంగా నమోదవడం ఊరటనిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 15,654 కరోనా పరీక్షలు నిర్వహించగా 136 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అలాగే వైరస్ తీవ్రతతో చిత్తూరు జిల్లాలో ఒకరు మరణించారు. జిల్లాల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే అనంతపురంలో 15, చిత్తూరులో 7, తూర్పు గోదావరి జిల్లాలో 25, గుంటూరులో 26, కడప జిల్లాలో 4, కృష్ణాలో 21, కర్నూలులో 3, నెల్లూరులో 5, ప్రకాశంలో 7, శ్రీకాకుళం జిల్లాలో 00, విశాఖలో 12, విజయనగరంలో 00, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మంది కొత్తగా వైరస్ బారిన పడ్డారు.
మరోవైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 803 మంది కరోనా నుంచి కోలుకుని సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 850 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 23 లక్షల 17 వేల 741గా నమోదైంది. తాజాగా సంభవించిన ఒక మరణంతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 14 వేల 726 మంది వైరస్‌కు బలయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..