Tuesday, November 26, 2024

స్కూళ్లలో పెరుగుతున్న కరోనా కేసులు

కరోనా తిరిగి పుంజుకుంటోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరగడం కలకలం రేపుతున్నాయి. ఆంద్రప్రదేశ్ లో కూడా కరోనా కేసలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలల్లో కరోనా కేసులు పెరగడం ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలోని పాఠశాలలో విద్యార్థులు కరోనా భారినపడ్డారు. తాజాగా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు విద్యార్ధులకు కరోనా పాజిటివ్ గాా నిర్దారణ అయింది. ఇక అనంతపురం జిల్లా కంబదూర్ లో మహిళా టీచర్ కు కరోనా వైరస్ సోకింది. అంతేకాదు గుంతకల్లు రైల్వే లోని ట్రైనింగ్ ట్రాక్షన్ విభాగంలో 17మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిన్న ఒక్కరోజే 36 కేసులు నమోదు, మొత్తం యాక్టివ్ కేసులు 186. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన మొదలయింది. తిరుపతిలోని పలు పాఠశాలల్లో కూడా కరోనా కేసులు నమోదయ్యాయి. పెద్దసంఖ్యలో విద్యార్థులు కొవిడ్‌ బారిన పడుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఇళ్లకు పంపిస్తున్నారు తప్ప హాజరు మినహాయింపు ఇవ్వడం లేదు. పిల్లలందరికీ టెస్టులు చేయించడం లేదు. ఆ బాధ్యతను తల్లిదండ్రులకే వదిలేస్తున్నారు. దీంతో తమ పిల్లల ఆరోగ్యంపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హాజరు తగ్గితే పరీక్షలకు అనుమతించరేమోనన్న భయంతో పిల్లలను బడికి పంపిస్తున్నారు. ముఖ్యంగా టెన్త్‌ విద్యార్థుల తల్లిదండ్రులు మరింత ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే తెలంగాణలో విద్యాసంస్థలపై కరోనా పంజా విసరడంతో విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. దీంతో ఏపీలోని స్కూళ్ల సంగతేంటన్న ఉత్కంఠ తల్లిదండ్రుల్లో నెలకొంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల పాఠశాలలకూ చాపకింద నీరులా ఈ మహమ్మారి విస్తరిస్తోంది. కరోనా తీవ్రతతో అప్రమత్తమైన కేంద్రం ఏప్రిల్‌ నెలాఖరు వరకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

https://www.hmtvlive.com/andhra/coronavirus-second-wave-fear-in-ap-schools-62138

https://www.hmtvlive.com/andhra/coronavirus-second-wave-fear-in-ap-schools-62138
Advertisement

తాజా వార్తలు

Advertisement