Saturday, November 23, 2024

ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి: వైద్య శాఖ

రాష్ట్రంలో కోవిడ్ కేసులు బాగా తగ్గాయని ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే కేసులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు.  గడిచిన 24 గంటలలో 7,943 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 98 మంది కోవిడ్‌ బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐసీయూ బెడ్స్- 1,461, ఆక్సిజన్ బెడ్స్ 6,323 అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లో 15,106 వేల‌మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. జిల్లాల్లో రెమిడెసివర్ ఇంజక్షన్లు 1,75,000 డోసులు జిల్లాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే ఆక్సిజన్ వినియోగం కూడా బాగా తగ్గిందన్నారు. 104 కాల్ సెంటర్ కి వచ్చే కాల్స్ సంఖ్య తగ్గాయని వివరించారు.

రాష్డ్రంలో ఇప్పటి వరకు బ్లాక్ ఫంగస్ కేసులు1179 నమోదవ్వగా.. ఇందులో 14 మంది ఇప్పటివరకు మృతి చెందారని సింఘాల తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారిలో 743 మంది డయాబెటిస్ పేషేంట్స్ ఉన్నారని చెప్పారు. బ్లాక్ ఫంగస్‌కి అవసరమైన మందులు కేంద్రం కేటాయిస్తోందని తెలిపారు. అన్ని ఆసుపత్రులలో‌ 78 శాతం ఆరోగ్యశ్రీలో ట్రీట్ మెంట్ పొందుతున్నారని వెల్లలడించారు. రాష్ట్రంలో ఒకే సారి 14 మెడికల్‌ కాలేజీలకు శంఖుస్థాపన చేయడం దేశంలో ఇదే ప్రథమం అని సింఘాల్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement