Tuesday, November 26, 2024

సిక్కోలులో కరోనా కలకలం.. 503 మందికి పరీక్షలు, నలుగురికి పాజిటివ్‌

శ్రీకాకుళం, ప్రభ న్యూస్‌ బ్యూరో: శ్రీకాకుళంలో రెడు నెలల తరువాత మరళా కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం 8 గంటలనుంచి బుధవారం ఉదయం 8 గంటలవరకు 503 మందికి పరీక్షలు నిర్వహించగా, నలుగురికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లుగా తేలింది. దీంతో ప్రజలకు ఆందోళనకు గురవుతున్నారు. మరళా మూలకు చేర్చిన మాస్కులు బయటకు తీసే పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలో మూడవ విడత ప్రమాదకరంగా ఉంటుందని గతేడాది అక్టోబర్‌ నుంచి విస్తృత ప్రచారం చేశారు. ఈ ఏడాది జనవరి 9 నుండి కరోనా కేసులు పెరుగుదల ప్రారంభమైంది. ఒక్కసారిగా రోజుకు 100 నుంచి 200, 300, 500 అలా పెరుగుతూ రోజుకు 1250 కేసులు కూడా నమోదయ్యాయి.

దీంతో ఇటు ప్రజలు, అటు అధికారులు కలవర పడ్డారు. వ్యాక్సినేషన్‌ వేయించుకోవడం వలన, కరోనా నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మరణాల సంఖ్య తక్కువగా నమోదైంది. హాస్పిటల్‌ కంటే హోమ్‌ ఐసోలేషన్లో ఉంటూ మందులు వాడడంతో మూడవ విడత ప్రజలను అంతగా ఇబ్బంది పెట్టకుండా ఆరు వారాల వ్యవధిలోనే మళ్లిd తగ్గుముఖం పట్టింది. ఏప్రిల్‌ 22 నాటికి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య జీరోకు చేరుకుంది. అప్పటి నుంచి జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో జిల్లాలో అధికారులు ప్రభుత్వ కార్యక్రమాలలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజలు కూడా కరోనా పూర్తిగా తగ్గిపోవడంతో కరోనా నిబంధనలు పక్కన పెట్టి మాస్కులు అటకెక్కించారు.

ప్రభుత్వం కూడా దుకాణాల వద్ద, బస్సులలో నిబంధనలు ఉపసంహరించుకుంది. దీనికి తోడు వివాహాది శుభకార్యక్రమాలకు, రాజకీయ సమావేశాలకు హాజరయ్యే వారి సంఖ్యలో నిబంధనలు సడలించారు. దీంతో పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. కరోనా భయం వదిలింది అని అందరూ హాయిగా ఉంటున్న సమయంలో బుధవారం నుంచి జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడం ప్రారంభమయ్యాయి. దీంతో ప్రజలు అధికారులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 95 శాతం వరకూ జిల్లాలో ప్రజలు రెండు విడతల కరోనా వాక్సిన్‌ వేయించుకున్నారు. జిల్లాలో దాదాపు 40 శాతం వరకూ బూస్టర్‌ డోసు కూడా వేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. జూన్‌ 22వ తేదీన నాలుగు కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా ప్రారంభం తొలి విడతలో కూడా నాలుగు కేసుల నుంచే ప్రారంభం కావడమంతో ఆందోళనకు గురవుతున్నారు.

మంగళవారం ఉదయం 8 గంటల నుండి బుధవారం ఉదయం 8 గంటలవరకు 503 మందికి పరీక్షలు నిర్వహించగా, నలుగురికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లుగా స్పష్టం చేశారు. ఈ నలుగురూ హోమ్‌ ఐసొలేషన్‌లోనే ఉంచినట్లుగా అధికారులు తెలియజేశారు. కరోనా కేసులు మళ్లిd జిల్లాలో నమోదు ప్రారంభం కావడంతో కరోనా నింబంధలను కఛ్చితంగా పాటించి, వ్యాప్తిని బాగా తగ్గించవచ్చని వైద్యులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement