Monday, November 25, 2024

Cool..Cool – ఎపి ట్రాఫిక్ పోలీసుల‌కు ఎసి హెల్మెట్స్ …

అమరావతి, ఆంధ్రప్రభ: పోలీసుశాఖలో కింది స్ధాయి సిబ్బంది విధులు అత్యంత కష్ట తరం. అలాంటిది ట్రాఫిక్‌ డ్యూటీ అంటే ఏకంగా 8 నుంచి 10 గంటల పాటు నడి రోడ్డుపై రెండు కాళ్ళమీద నిలబడాల్సిందే. రాను రాను కాళ్ళు, కీళ్ళు వాపులతోపాటు కాలుష్యం వల్ల శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొంటు న్నారు. ఇక మండుటెండలో రోడ్డుపై విధు లంటే ప్రాణాలతో చెలగాటమే. వేసవిలో ట్రాఫిక్‌ డ్యూటీ చేయాలంటే సిబ్బంది హడలి పోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మండుతు న్న ఎండలు, వీస్తున్న వడగాలులతో ఎంతో మంది అస్వస్ధతకు గురవుతున్నారు. మృత్యువాత పడుతున్నారు. అయినా తప్పని విధి నిర్వహణలో ఎండ వేడిమి నుంచి ఒకింత ఉపశమనం కలిగించేందుకు రాష్ట్రంలో ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు అధికారులు సమకూర్చుతున్నారు. సిబ్బందికి సైతం ఎంతో కొంత ఉూరటనిస్తున్నాయి. అయితే జిల్లాల పరిధిలో ఈ ఏసీ హెల్మెట్‌లను కొనుగోలు చేసి సమకూర్చుకునేందుకు అక్కడి అధికారులు స్పాన్సర్స్‌ కోసం అన్వేషిస్తున్నారు. కేవలం ఆయా జిల్లాల ఎస్పీల సిబ్బంది పడుతున్న కష్టాలను గుర్తించి స్వయంగా వీటిని ఆర్డర్‌ పెడుతున్నారు. ఇందుకోసం వీటిని అందిస్తున్న స్టార్టప్‌ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే వీటి కొనుగోలుకు కావాల్సిన నిధుల కోసం స్పాన్సర్స్‌ను వెదుకుతున్నారు.

ఏసీ హెల్మెట్‌ల పనితీరు..
పరిశ్రమల్లో పని చేసే సిబ్బందిని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన ఈ హెలె ్మట్‌ బరువు 700 గ్రాముల వరకు ఉంటుంది. హైదరాబాద్‌కు చెందిన జర్ష్‌ అనే స్టార్టప్‌ కంపెనీ వీటిని తయారు చేసింది. సుమారు 8 గంటల పాటు చార్జింట్‌ పెడితే దాదాపు మూడు గంటలకు పైగా పని చేస్తుంది. ఈ హెల్మెట్‌లో లభిం చే చల్లదనం తలకు పెట్టుకున్నప్పుడు ఎండలో ఉన్నా తలంతా చల్లగా మారి కళ్ళు, ముఖంపై చల్లని గాలి రావడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ఏసీ హెల్మెట్‌ ధరించినప్పుడు బయట ఉష్ణోగ్రతకు లోపల ఉష్ణోగ్రతకు 10 డిగ్రీలు తేడా ఉంటుంది. అయితే వీటిలో రెండు రకాలు ఉన్నాయి. చార్జి ంగ్‌ బ్యాటరీ హెల్మెట్‌కే అమరి ఉంటుంది. అలాగే బ్యాటరీ నడుముకు క ట్టుకోవడం దానికి తలపై హెల్మెట్‌కు ఓ వైరు అనుసంధానించబడి ఉండటం మరో రకం. ఈ రెండో రకం హెల్మెట్‌లు మరింత మెరుగా పని చేస్తున్నట్లు చెబుతున్నారు. కూలెంట్‌ గ్యాస్‌ ఎకి ్కంచడం, లోపల కంప్రెషర్‌ అవసరం ఉండదు. కేవలం చార్జి ంగ్‌ మీదే బ్లోయర్‌లు పని చేస్తాయి. జీరో మెయిన్‌టెనెన్స్‌గా చెబుతున్నారు. సాలిడ్‌ స్టేట్‌ టెక్నాలజీ ద్వారా దీని రూపకల్పన జరిగింది.

ప్రయోగాత్మకంగా అనంతపురంలో..
రాష్ట్రంలో తొలిసారిగా అనంతపురం రేంజ్‌ పోలీసులు ఏసీ హెల్మెట్‌లను అందుబాటు-లోకి తీసుకువచ్చారు. ఈ ఏసీ హెల్మెట్‌లు హైదరాబాద్‌ రాచకొండ పోలీసులు వినియోగించడాన్ని తెలుసుకున్న మన పోలీసులు దీనిపై దృషి సారించారు. అనంతపురం రేంజ్‌ డిఐజి అమ్మిరెడ్డి సదరు కంపెనీ వారిని పిలిపించి వివరాలు సేకరించారు. వీటి పనితీరుపై కంపెనీ ప్రతినిధులు డెమో నిర్వహించి చూపించారు. దీంతో శాంపిల్స్‌ తీసుకుని ట్రాఫిక్‌ సిబ్బందికి ఇచ్చి వీటి పనితీరుపై ఫీడ్‌ బ్యాక్‌ కోరుతున్నారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఏసీ హెల్మెట్‌లు సత్ఫలితాలిస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. సదరు కంపెనీ నుంచి ఒక్కొక్కటి రూ. 7,500కు కొనుగోలు చేసేలా ఒప్పందం చేశారు. అనంతపురం రేంజ్‌ పరిధిలోని అనంతపురం, సత్యసాయి జిల్లా, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు కలిపి 25 చొప్పున మొత్తం 100 ఏసీ హెల్మెట్‌లు ఆర్డర్‌ పెట్టారు. అనంతపురం, సత్యసాయి జిల్లాలకు మాత్రం కియా కంపెనీ స్పాన్సర్‌ చేస్తోంది. మామూలుగానే వేసవిలో ట్రాఫిక్‌ సిబ్బందికి అందించే టోపీ, కళ్ళజోడు, వాటర్‌ బాటిల్‌, మాస్క్‌లతో కూడిన కిట్‌లతోపాటుగా ఈ ఏసీ హెలె ్మట్‌లు అందిస్తున్నారు. ఇక తిరుపతి, చిత్తూరు జిల్లాలకు మాత్రం అక్కడి ఎస్పీలు స్పాన్సర్‌ కోసం అన్వేషణలో ఉన్నారు.

మిగిలిన జిల్లాలకు..
అనంతపురం రేంజ్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఏసీ హెల్మెట్‌ల గురించి తెలుసుకున్న ఇతర జిల్లాలు ఇప్పుడు వీటిపై దృష్టి సారించాయి. ఆయా జిల్లాల ఎస్పీలు తమ పరిధిలోని ట్రాఫిక్‌ సిబ్బందికి అందించేందుకు ముందుకు వచ్చి హెల్మెట్‌లు ఆర్డర్‌ పెట్టేందుకు స్పాన్సర్స్‌ను వెతుకుతున్నారు. ఇదిలావుండగా త్వరలో హెల్మెట్‌పై ఇన్‌బిల్ట్‌ కెమెరాను జోడించేందుకు కంపెనీ మార్పులు చేస్తోంది. తద్వారా పోలీసులు, ప్రజలు ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించిన సందర్భాలను రికార్డ్‌ చేయడం జరుగుతుంది. ఇప్పటికే పోలీసుశాఖలో బాడీ వార్న్‌ కెమేరాలు వినియోగంలో ఉన్నాయి. వీటి తరహాలోనే ఇక హెల్మెట్‌ కెమేరాలు రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement