Tuesday, November 19, 2024

టీకా ధ‌ర‌ల వెనుక లోగుట్టు…

ఆంధ్ర‌ప్ర‌భ దిన‌ప‌త్రిక ప్ర‌త్యేక క‌థ‌నం
ప్రయివేటుకు ఇంకో ధర
ప్రామాణికత ఏదీ
ప్రజాధనంతోనే రీసెర్చ్‌
పేటెంట్‌ కేంద్రానిదే
ఉత్పాదకత సంస్థలది
లైసెన్సింగ్‌ విధానమేదీ
బడ్జెట్‌లో రూ.35 వేల కోట్లు
పీఎం కేర్‌కు రూ.48వేల కోట్లు
వ్యాపార పరమార్థం ఏమిటి
నాకు తెలుసన్న ప్రధాని వెూడీ
అగ్రచట్టాల వెనుకా అదే…
అదానీ, అంబానీల కథ!
విరాళాలే అసలు కారణమా
మేథావుల విమర్శలు

ఓ వైపు దేశంలో కోవిడ్‌ కేసులు పెరుగ ుతున్నాయి. మరోవైపు వ్యా క్సిన్‌ల కొరత తీవ్రంగఉంది. ఈ దశలో వ్యాక్సిన్‌ తయారీదార్లు సగం ఉత్పత్తుల్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకునేందుకు అనుమతులి వ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులకు వేర్వేరు ధరల్తో అమ్మే వెసులుబాటును కూడా కేంద్రం కల్పించడం పలు సందె హాలకు దారితీస్తోంది. దేశంలో ఇప్పటికే రెండు రకాల వ్యాక్సి న్‌లతయారీకి కేంద్రం అనుమతులిచ్చింది. ఈ రెండింటి తయారీ బాధ్యతను ప్రైవేటు సంస్థలకే అప్పగించింది. వీటి నుంచి తొలుత కేం ద్రమే వ్యాక్సిన్‌లను కొనుగోలు చేసేది. రాష్ట్రాల వారీగా వ్యాక్సిన్‌లను పంపిణీ చేసింది. కాగా ఈ నెల 1వ తేదీ నుంచి వ్యాక్సిన్‌ల విక్రయాల్లో కొ త్త మార్పులకు కేంద్రం తెరదీసింది. దేశంలో ఉత్పత్తవుతున్న కోవీ షీల్ట్‌, కోవాగ్జిన్‌ రెండింటిని కేంద్రానికైతే ఒక్కో వ్యాక్సిన్‌కు రూ. 150 లు, అదే రాష్ట్ర ప్రభుత్వాలైతే కోవీషీల్ట్‌కు రూ. 400, కోవాక్సిన్‌ అయితే రూ.600లు, ప్రైవేటు ఆసుపత్రులైతే కోవీషీల్ట్‌ 600, కోవాగ్జిన్‌ 1200 లకు చొప్పున అమ్ముకునే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇక విదేశీ ఎగుమతులకైతే ధరల్ని నిర్ణయించుకునే హక్కును ఉత్పాధక సంస్థలకే కట్టబెట్టింది. కేంద్ర నిర్ణయాన్ని దేశంలోని బిజెపి పాలిత రాష్ట్ర ప్రభు త్వాలు మినహా మిగిలిన రాష్ట్రాలన్నీ వ్యతిరేకించాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ అయితే కేంద్ర నిర్ణయానికి సాగిలపడింది. 11కోట్ల వ్యాక్సిన్‌లను ఈ ధర లపై కొనుగోలు చేస్తామని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్‌ ప్రకటించారు. ఐదున్నర కోట్లు కోవాగ్జిన్‌, మరో ఐదున్నర కోట్లు కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌లకు ఆర్డర్లు కూడా జారీ చేసేశారు. ఓ పక్క టీకాల్లేక కోవిడ్‌ సంక్రమణ వ్యాప్తి జోరుగా ఉంది. టీకాలు పొందిన వ్యక్తులు కోవిడ్‌ బారిన పడ్డా పెద్దగా ఆరోగ్య సమస్యలు తలెత్తడంలేదు. ఇప్పు డు భారత్‌కు కోవిడ్‌ వ్యాక్సిన్‌ గొప్ప ఆక్సిజన్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు సంస్థలు వ్యాక్సిన్‌ విక్రయ ధరల్ని సొంతంగా నిర్ణయించుకునే అధికారాన్ని కేంద్రం ఇవ్వడంపై పలు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
వాస్తవానికి కోవీషీల్ట్‌ యొక్క 97శాతం పరిశోధన మరియు అభి వృద్ది ప్రజానిధుల్ని వినియోగించి ఆష్ట్రాజనక, ఆక్స్‌ఫర్డ్‌ వర్శిటీల చేత చేయబడింది. అలాగే కోవ్యాగ్జిన్‌ పరిశోధన కేంద్ర ప్రభుత్వ అధీనం లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది. ఇందుకోసం ప్రజాధనాన్నే వినియోగించారు. కేంద్రం నేరుగా 3వేల కోట్లు ఆర్ధిక సాయాన్నందించింది. ఆ తర్వాత కోవాగ్జిన్‌ ఉత్పత్తి బాధ్య తను ప్రైవేటు సంస్థ భారత బయోటెక్‌కు అప్పగించారు. దీనిపై మేథో సంపత్తి హక్కులు పూర్తిగా భారత ప్రభుత్వానిదే. కేవలం ఉత్పాధక అధి కారాన్ని మాత్రమే భారత బయోటెక్‌ కలిగుంది. ప్రస్తుతం తయా రౌతున్న కోవాగ్జిన్‌ టీకాలో 97శాతం ఐసిఎమ్‌ఆర్‌, ఎన్‌ఐవిలు కేంద్ర నిధుల సహాయంతో పూర్తి చేసినవే. వాస్తవాలు ఇలా ఉంటే ఉత్పత్తి విలువను నిర్ణయించుకునే అధికారాన్ని మాత్రం కోవాగ్జిన్‌ తయారు చేస్తున్న భారత్‌ బయోటెక్‌, కోవీషీల్ట్‌ తయారు చేస్తున్న సీరమ్‌ ఇని స్టిట్యూట్‌కు దాఖలైపోయాయి. వాస్తవానికి ఇటువంటి భారీ ఉత్పతు ్తలకు అనుమతులిచ్చే సమయంలో ప్రభుత్వం లైసెన్సింగ్‌ విధానాన్ని అనుసరించాలి. అలాగే ఔషద తయారీదార్ల నుంచి ధరల బిడ్లను ఆహ్వానించాలి. పూర్తిగా ప్రభుత్వ మేథోసంపత్తితో అభివృద్ది చేసిన వ్యా క్సిన్‌ల తయారీకి ధరలు నిర్ణయించుకునే హక్కును సంబంధిత సం స్థలకప్పగించడం సరికాదంటూ ఇప్పటికే కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పి చిదంబరం విమర్శలు గుప్పించారు. అలాగే ప్రముఖ జర్న లిస్ట్‌ కరణ్‌థాపర్‌ దీనిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతేడాది సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌తో కేంద్రం పదికోట్ల వ్యాక్సిన్‌ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ నెలకోసారి ఒకట్నుంచి రెండు కోట్ల డోసులకు మాత్రం ఆర్డర్లు జారీ చేస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో కేవలం టీకా కార్యక్రమం కోసం 35వేల కోట్లు కేటాయించారు. అలాగే పిఎమ్‌కేర్‌ ఫండ్‌కు సుమారు 48వేల కోట్లు విరాళాలుగా వచ్చాయి. టీకాల కోసం బడ్జెట్‌లో జరిపిన కేటాయింపుల్లో ఇంతవరకు 9వేల కో ట్లు మాత్రమే వ్యయం చేశారు. ఇక పిఎమ్‌కేర్స్‌కు విరాళాలకు సం బంధించి ఎలాంటి ఆడిట్‌లకు అవకాశం లేకపోవడంతో ఈ మొత్తం ఏ ఏ కార్యక్రమాలకు మళ్ళిందన్న దానిపై ఎలాంటి వివరాలు అందు బాటులో లేవు. ఇదిలా ఉంటే సీరమ్‌ అనిస్టిట్యూట్‌ అధినేత ఆధార్‌పూ నావాలా తమ ఉత్పత్తి ధరను నాలుగొందల్నుంచి మూడొందలకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై విమర్శకులు విరుచుకుపడుతున్నా రు. ఒక పారిశ్రామికవేత్త దయాదాక్షిణ్యాలకనుగుణంగా రాష్ట్ర ప్రభు త్వాలు కొనుగోలు చేపట్టాలా అంటూ మండిపడుతున్నారు. కేంద్రా నికిచ్చే ధర రూ. 150కాగా రాష్ట్రాలకు రెట్టింపు ధరను నిర్ణయించడం ఏ విధంగా సమంజసమని నిలదీస్తున్నారు. రాష్ట్రాలకు అదనపు నిధు లు అందుబాటులో ఉండవు. కేంద్రం తరహాలో అపరిమిత నిధుల స మీకరణకు అవకాశాలుండవు. రాష్ట్రాలు ఉన్న నిధుల్తోనే సంక్షేమ, అ భివృద్ది కార్యక్రమాల్ని అమలు చేయాలి. అలాగే రిజర్వ్‌బ్యాంక్‌ నుంచి రుణాలు పొందేందుక్కూడా రాష్ట్రాలకు ఖచ్చితమైన పరిమితుంటుం ది. కోవిడ్‌ నేపధ్యంలో రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోయాయి. పైగా కోవిడ్‌ శాకుతో రాష్ట్రాలకు ప్రముఖుల్నుంచొచ్చిన విరాళాలేవీ లేవు. కేం ద్రమే నిర్దిష్ట ధరకు టీకాల ఉత్పత్తి చేయగలిగే సంస్థల్ని ఆహ్వా నించడంతో పాటు దేశవ్యాప్తంగా టీకాల్ని ఉచితంగా పంపణీ చేయా లి. లేనిపక్షంలో టీకాల ధరల నిర్ణయానికి సంబంధించి కేంద్ర ఆలోచనలపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో ఓ సారి ప్రధాని నరేంద్రమోడి స్వయంగా గుజరాతీనైన తాను వ్యాపార పరమార్ధాన్ని అర్ధం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు సిద్దం కాకపోవడం ఆయనలోని వ్యాపార తత్వాన్ని మరోసారి బహిర్గతం చేస్తోంది. రైతుల ఖర్చుతో ప్రైవేటు పారిశ్రామిక వ్యవస్థలకు ఈ వ్యవసాయ చట్టాలు ప్రయోజనాల్ని చేకూర్చే వెసులుబాటుంది. వీటికి విరుద్దంగా రైతులు సుదీర్ఘ పోరాటం నిర్వహించారు.
ఈ పోరాటంలో ప్రధాని మోడితో పాటు వ్యవ సాయ చట్టాల కార ణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ల బ్ధిపొందే అంబానీలు, అదానీల్ని కూడా రైతులు లక్ష్యంగా చేసుకున్నారు. వారిపై కూడా తమ ఆగ్ర హావేశాల్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో రాజకీయ విరాళాల నిబంధనల్లో మోడి పలు మార్పులు చేశారు. దాతల రక్షణకు ఖాతాల్లో సవరణల ు చేశారు. ఇందుకోసం భారత పారదర్శక చట్టంలో కూడా కొన్ని అంశాల్ని తొలగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement