అమరావతి, ఆంధ్రప్రభ: కృష్ణా నదిలో వరద ప్రవాహం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. గడిచిన రెండు వారాలుగా ఎగువ నుంచి సగటున 4 లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుకోగా శనివారం రాత్రికి ఇన్ ప్లnో 2,50,250 క్యూసెక్కులకు తగ్గింది. ఒక వైపు శ్రీశైలం కుడి, ఎడమ గట్టు- విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూనే ఇన్ ప్లnో కన్నా అధికంగా 3,07,896 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 885 అడుగుల గరిష్ట నీటిమట్టానికి గాను 884.6 అడుగుల వరకు నీటిని స్థిరంగా వచ్చి వరద రూపంలో వచ్చే అదనపున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జలాశయం గరిష్ట నీటి నిల్వ సామర్దం 215.81 టీ-ఎంసీలు కాగా..213.4 టీ-ఎంసీల నీటి నిల్వలున్నాయి. శ్రీశైలం దిగువన నాగార్జున సాగర్ కూడా పొంగిపొర్లుతుంది. జలాశయం నీటి మట్టం 587.4 అడుగులకు చేరుకోగా 312.05 టీ-ఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్ద్యానికి గాను 305.75 టీ-ఎంసీల నిల్వలున్నాయి. ఎగువ నుంచి 2,52,594 క్యూసెక్కుల వరద ఇన్ ప్లో రూపంలో వచ్చి చేరుతుండగా 1,73,093 క్యూసెక్కులు అవుట్ ప్లnో రూపంలో దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుల కూడా పొంగిపొర్లుతోంది. 45.77 టీ-ఎంసీల జలాశయం గరిష్ట నిల్వ సామర్ద్యానికి గాను 37.5 టీ-ఎంసీల నిల్వలున్నాయి.
శనివారం రాత్రికి జలాశయం ఇన్ ప్లnో 1,38,753 క్యూసెక్కులుగా కాగా..అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా బేసిన్ లో దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్ కూడా నిండకుండలా తొణికిసలాడుతోంది. 3.07 టీ-ఎంసీల గరిష్ట సామర్ద్యానికి నీటి నిల్వలు చేరుకోగా ఎగువ నుంచి 1,40,872 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 3.07 టీ-ఎంసీలను స్థిరంగా ఉంచి 1,41,082 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
సుముద్రంలోకి 14.29 లక్షల క్యూసెక్కులు
కృష్ణమ్మలో వరద కాస్త నెమ్మదించినా గోదావరి మాత్రం పరవళ్ళు తొక్కుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ కు ఎగువ నుంచి శనివారం 14,29,357 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా వచ్చిన నీటిని వచ్చినట్టు- దిగువన సముద్రానికి విడుదల చేస్తున్నారు. ఒక వైపు తెలంగాణలోని భద్రాచలంతో పాటు- ఏపీలోని ధవళేళ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. మరో వైపు ఉత్తరాంధ్రలోని వంశధార వద్ద వరద తగ్గుముఖం పట్టింది. ఒక వైపు వంశధార ఆయకట్టు-కు సాగునీటిని విడుదల చేస్తూ సుమారు 25 వేల క్యూసెక్కుల నీటిని గొట్టా బ్యారేజ్ లోకి పంపిస్తున్నారు.
అదనంగా వచ్చి చేరుతున్న సుమారు 20 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి పంపిస్తున్నారు. నాగావళి నుంచి సుమారు 1500 క్యూసెక్కులను ఆయకట్టు-కు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న సుమారు 6 వేల క్యూసెక్కుల నీటిని తోటపల్లి బ్యారేజీలోకి విడుదల చేస్తున్నారు. అదనపు జలాలను నారాయణపురం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.