Wednesday, November 20, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటల సమయం

తిరుమల, ప్రభ న్యూస్‌ : తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. తమిళులకు ఇష్టమైన పెరటాసి మాసం, వరుస సెలవుల కారణంగా తిరుమలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా చేరుకుంటున్నారు. దీంతో తిరుపతి, తిరుమలలో భక్తులు వచ్చిన వాహనాలను పార్కింగ్‌ చేసేందుకు కూడా స్థలం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్సు-1, నారాయణగిరి ఉద్యానవనాలు పూర్తిగా నిండి క్యూ లైన్‌లు కల్యాణవేదిక వద్దకు చేరుకున్నారు.

దీంతో సర్వదర్శనానికి సరాసరి 30 గంటల సమయం పడుతోంది. టిటిడి ఈవో ఏవి.ధర్మారెడ్డి ఆదేశాల మేరకు రద్దీని దృష్టిలో పెట్టుకున్న అధికారులు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు, అల్పారం లాంటివి శ్రీవారి సేవకుల సహాయంతో నిరంతరాయంగా అందచేస్తున్నారు. అలాగే క్యూలైన్‌లను సీనియర్‌ అధికారుల పర్యవేక్షణలో నిరంతరాయంగా పరిశీలిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement