కర్నూలు, (ప్రభ న్యూస్) : జిల్లాలోని పట్టణ, మౌళిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) నిర్మించిన ఇళ్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు వేగంగా పూర్తిచేస్తున్నారు. టిడ్కో ఎస్‌ఈ రాజశేఖర్ ఆధ్వర్యంలో జగన్నాథగట్టు, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు, డ్రైనేజీ నిర్మాణానికి ప్రత్యేకంగా అడుగులు వేస్తున్నారు. కర్నూలు నగరపాలక సంస్థలోని జగన్నాథగట్టు వద్ద 10వేల గృహాల నిర్మాణం చేపట్టగా ఇందులో, 4,025 మందికి పంపిణీ చేయడానికి గాను10.73కిలోమీటర్ల రోడ్లకు గాను ఇప్పటికే 6 కిలోమీటర్లు రోడ్లు పూర్తిచేశారు. 10.14 కిలోమీటర్ల వాననీటి కాల్వలకు 8 కిలోమీటర్లు పూర్తిచేయగా, డ్రైనేజీ కాల్వలకు సంబంధించి 14.96 కిలోమీటర్లకు 6కిలోమీటర్లు పూర్తిచేశారు. ఆదోనిలోని చిరుగుప్ప రోడ్డులో నిర్మించిన గృహాలలో 4,720 గృహాలు నిర్మించగా వాటిలో 1,310 గృహాలు పంపిణీ చేయడానికి కావాల్సిన రోడ్లు, వాననీటి కాల్వలు, డ్రైనేజీకి సంబంధించి 4.95 కిలోమీటర్ల రోడ్లకు గానూ 4.75 కిలోమీటర్లు పూర్తి చేయగా, 5.58 కిలోమీటర్ల వాన నీటి కాల్వకు 5 కిలోమీటర్లు పూర్తిచేశారు.
డ్రైనేజీకి సంబంధించి 6.25 కిలోమీటర్లకు గానూ 4 కిలోమీటర్లు పూర్తిచేశారు. ఎమ్మిగనూరులోని 3,264 గృహాలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికే 940 గృహాలు పూర్తిచేశారు. వాటిలో రోడ్లు, కాలువలు, డ్రైనేజీలకు సంబంధించి వేగంగా పనులు జరుగుతున్నాయి. నంద్యాలలోని నందమూరి నగర్, ఎస్‌ఆర్‌బీసీలో 7,728 గృహాలకు 2256 గృహాలు పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు. వాటిలో రోడ్లు, వాన నీటి కాల్వలు, డ్రైనేజీలకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 11 కిలోమీటర్ల రోడ్డుకు గానూ 8కిలోమీటర్లు పూర్తిచేయగా, 12 కిలోమీటర్ల డ్రైనేజీ రోడ్డుకు గానూ 8 కిలోమీటర్ల డ్రైనేజీ కాల్వలను పూర్తిచేశారు. వాననీటి కాల్వలకు సంబంధించి 9 కిలోమీటర్లకు గాను 3 కిలోమీటర్లు పూర్తిచేశారు. ప్రస్తుతం టిడ్కో ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పన వేగవంతంగా జరుగుతోంది. ఎస్‌ఈ క్షేత్రస్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ మౌలిక వసతులు వందశాతం పూర్తిచేయడానికి అడుగులు వేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital