Friday, November 22, 2024

Construction: నిర్మాణ రంగానికి ఊర‌ట‌.. దిగొచ్చిన సిమెంట్ రేట్లు.. ఎంతంటే..

గిరాకీ లేక‌పోవ‌డంతో దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్‌ తయారీ కంపెనీలు రేట్ల‌ను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ రాష్ట్రాల్లో బస్తాకు రూ.40 వరకు, తమిళనాడులో రూ.20 దాకా కోతలు పడ్డాయని వార్తా సంస్థ ఇన్ఫామిస్ట్‌ డీలర్లు తెలిపారు. కేరళ, కర్నాటకల్లోనూ రూ. 20-40 వరకు త‌గ్గించిన‌ట్టు తెలిపారు. ఈధరల తగ్గింపు నేపథ్యంలో 50 కిలోల బస్తా ఏపీ, తెలంగాణ‌లో రూ.280-320కి పరిమితం కానుంది.

తమిళనాడులో ఒక టాప్‌ బ్రాండ్‌ సిమెంట్‌ ధర రూ.400 దిగువకు, కర్నాటక, కేరళల్లోనూ బస్తాధర రూ.360-400 నుంచి 340-380కి చేరినట్లు డీలర్లు వివరించారు. కోత విధించిన కంపెనీల్లో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండియా సిమెంట్స్‌, ఓరియంట్‌ సిమెంట్స్‌, సాగర్‌ సిమెంట్స్‌, అంబుజా సిమెంట్స్‌, రామ్‌కో సిమెంట్స్‌, చెట్టినాడ్‌ సిమింట్‌, ఎన్‌సిఎల్‌ ఇండిస్టీస్‌ , థాల్మియా భారత్‌, శ్రీ సిమెంట్‌, హెడల్‌బర్గ్‌ సిమెంట్‌ ఇండియా తదితరాలున్నాయి.

నవంబర్‌ చివర్లో ధరలను పెంచాలని సిమెంట్‌ కంపెనీలు భావించాయి. గిరాకీ త‌గ్గ‌డంతోపాటు.. కొన్ని ప్రాంతాల్లో డీలర్ల నుంచి వ్యతిరేకత రావడంతో కంపెనీలు ఆ ఆలోచనను విరమించుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అకాల వర్షాలు.. ద్రవ్యలభ్యత సమస్యతో గిరాకీ మరింతగా తగ్గిందని డీలర్లు చెబతున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ రాష్ట్రాల్లో నవంబర్‌ చివరి వారం నుంచి డిసెంబర్‌ తొలి వారం వకు భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో అమ్ముడుపోని ఇల్లు అధిక స్థాయిలో ఉండటంతో కొత్త ప్రాజెక్టులపై ప్రభావం పడుతోంది. బిల్డ‌ర్ల‌ వద్ద డబ్బులు లేక సిమెంట్‌ వినియోగం సైతం తగ్గింది. జనవరి మధ్యలో కానీ, ఫిబ్రవరి ప్రారంభంలో కాని దక్షిణాదిన గిరాకీ పుంజుకునే అవకాశం ఉందని సిమెంట్‌ కంపెనీలు భావిస్తున్నాయని డీలర్లు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement