డెంకాడ, (ప్రభ న్యూస్) : ఎస్డిఆర్ఎఫ్ కానిస్టేబుల్‌గా విధి నిర్వహణలో భాగంగా పరుల ప్రాణాలను కాపాడేందుకు వెళ్లి ప్రమాదవసాత్తు తన ప్రాణాలను కోల్పోయిన దురదృష్టకర ఘటన నిన్న చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగులో తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాల వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లిన చింతలవలస ఏపీఎస్పీ 5వ బెటాలియన్ నుంచి కెల్ల శ్రీనివాసరావు (పీసీ నెంబర్ 1393) తన లైఫ్ జాకెట్ తెగిపోవడంతో నీటి మునిగి ప్రాణాలు కోల్పోయారు.
శ్రీనివాసరావు భౌతిక ఖాయం సందర్శనార్ధం బెటాలియన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమం అనంతరం శ్రీనివాసరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని కందిస గ్రామానికి భౌతిక ఖాయాన్ని తరలించనున్నారు. ఇదిలా వుండగా, విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసరావు సేవలు అందరికీ ఆదర్శమని ఏపీఎస్పీ అదనపు డీజీపీ శంకబ్రాత బాగ్చి, ఐదవ బెటాలియన్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్, విజయనగరం ఎస్పీ దీపికా పాటిల్ యితర పోలీస్ అధికారులు పేర్కొన్నారు. వీర మరణం పొందిన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital