Sunday, November 24, 2024

Exclusive | గుంటూరు లాడ్జిలో కానిస్టేబుల్​ కహానీ.. యువతితో కలిసి అడ్డంగా దొరికిపోయాడు!

అతనో పోలీసు కానిస్టేబుల్​.. అయితే అతని పర్సనల్​ లైఫ్​లో ఎలా ఉన్నా.. డ్యూటీ పరంగా తేడా రావొద్దు. కానీ, ఈ కానిస్టేబుల్​ మాత్రం వివాహేతర సంబంధం పెట్టుకుని ఏకంగా లాడ్జిలోనే దుకాణం పెట్టేశాడు. ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన గుంటూరులో జరిగింది.

గుంటూరులో శ్రీనివాసరావు అనే వ్యక్తి కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్నాడు. ఆయనకు ప్రకాశం జిల్లాకు చెందిన యువతితో వివాహం జరిగింది. ఇదే సమయంలో మరో యువతితో కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసిపోయింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. తాజాగా గుంటూరులోని ఓ లాడ్జిలో సదరు యువతితో శ్రీనివాసరావు కలిసి ఉండగా ఆయన భార్య, బంధువులు కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అక్కడి నుంచే పోలీసులకు వారు సమాచారం అందించారు. దీంతో, లాడ్జికి చేరుకున్న పోలీసులు ఆయనను, యువతిని అక్కడికక్కడే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement