Friday, November 22, 2024

Big Story | పరిశ్రమలతో స్కిల్స్‌ కాలేజీల అనుసంధానం.. జాబ్‌ మేళాలతో 30 వేల ఉద్యోగాలు

అమరావతి, ఆంధ్రప్రభ: స్కిల్‌ కాలేజీలు, పాలిటెక్నిక్‌, ఐటీ కళాశాలల్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి ఆయా కంపెనీలకు అవసరమైన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్‌ప్లాన్‌ రూపొందించింది. ఆగస్ట్‌ 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 200 పరిశ్రమలు, సంస్థలతో భాగస్వామ్యానికి గడువు నిర్దేశించుకుని కార్యాచరణతో ముందుకెళ్లేలా ఒక ప్రత్యేక బృందం ఏర్పాటు- చేస్తోంది. అనుసంధాన ప్రక్రియ పూర్తయిన వెంటనే స్కిల్‌కళాశాలలు, హబ్‌లకుసంబంధించి కొత్త విధానంలో బ్రాండింగ్‌ చేసేందుకు ఏపీఎస్‌ఎస్‌డీసీ చర్యలు చేపట్టింది.

- Advertisement -

ఉద్యోగానికి గ్యారంటీ

మానవ వనరుల్ని సరైన రీతిలో వినియోగించుకోవడంలో నైపుణ్యాలు కీలకపాత్ర పోషిస్తాయి. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అనేది ఒక ఆస్తి, స్థిరమైన ఆర్థిక అభివృద్ధికి అది అవసరం. పెరుగుతున్న యువ జనాభా విధాన రూపకర్తలకు అనేక అవకాశాలతో పాటు సవాళ్ళను విసురుతోంది. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర యువతను తీర్చిదిద్దేందుకు నైపుణ్యాభివృద్ధిశాఖ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది.

నానాటికీ మారుతున్న సాంకేతిక నైపుణ్యాలను యువతకు అందించడంతో పాటు పరిశ్రమల్లో నైపుణ్యంతో పనిచేసే విధంగా తీర్చిదిద్దేలా విద్యాభ్యాసం సమయం నుంచే తర్ఫీదు ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే అనుసంధాన ప్రక్రియపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. స్కిల్‌ గ్యాప్‌ సమస్యను పరిష్కరించడంతో పాటు భవిష్యత్‌లో ఉద్యోగానికి గ్యారంటీ ఇచ్చేలా ఐటీఐ, పాలిటెక్నిక్‌ స్కిల్‌ కళాశాలల విద్యార్థులకు అప్రెంటీస్‌షిప్‌ నుంచే శిక్షణ ఇవ్వనున్నారు.

జాబ్‌మేళాల ద్వారా 30 వేల ఉద్యోగాలు లక్ష్యం

ఈ ఏడాది 286 జాబ్‌ మేళాల ద్వారా 30వేల మందికి ఉద్యోగాలందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇప్పటివరకూ నిర్వహించిన మేళాల్లో 1,05,889 మందికి ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించారు. ఈఏడాదిలో 26 జిల్లాలలో నిర్వహించిన 38 జాబ్‌ మేళాల్లో 4,774 మంది ఉద్యోగాలు పొందారు. ప్రతి నెలా ఓ నియోజకవర్గంలో ఒక జాబ్‌ మేళా, ప్రతి నెలా పరిశ్రమల అనుసంధానంతో ఒక మినీ జాబ్‌ మేళా, ప్రతి 3 నెలలకోసారి ఒక్కో జిల్లాలో ఏడాదికి 4 మెగా జాబ్‌ మేళాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. ప్రతి జాబ్‌ మేళాలో కనీసం 10 పేరున్న పరిశ్రమలు, కంపెనీలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రతి మంగళవారం, శుక్రవారం రోజులలో జాబ్‌ మేళా నిర్వహణకు షెడ్యూల్‌ రూపొందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజుల్లో జాబ్‌ మేళాల్లో పాల్గొనేందుకు కొన్ని పరిశ్రమలు అంగీకారం తెలిపాయి. మ్యానుఫాక్చరింగ్‌, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఆటో మొబైల్‌, రి-టైల్‌, ఐ.టీ- రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా యువతకు మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రణాళికలువ రూపొందిస్తోంది. స్కిల్‌హబ్‌ లలో మౌలిక సదుపాయాల ఏర్పాటు-, శిక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేయడం ద్వారా యువతలో నైపుణ్యాలకు నెగిషీ చెక్కాలనే ఆలోచన చేస్తోంది.

బ్రాండింగ్‌పై దృష్టి

నైపుణ్య శాఖ చేపడుతున్న కార్యక్రమాల బ్రాండింగ్‌ పై దృష్టి సారిస్తున్నారు. ఐటీ-ఐ, పాలి-టె-క్నిక్‌ కాలేజీల్లో మెరుగైన వసతుల కల్పన దిశగా ప్రణాళికలు రూపొందించారు. పాలి-టె-క్నిక్‌ విద్యలో సిలబస్‌, కోర్సుల డిమాండ్‌, ప్రతి ఏటా చేరే విద్యార్థుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. పేరున్న కాలేజీల కన్నా ప్రముఖ బ్రాంచ్‌ లలో చదివేందుకే విద్యార్థులు ఆసక్తిని కనబరుస్తున్నారు. శిక్షణ పూర్తయిన వెంటనే ఉపాధి అవకాశాలుండే కోర్సులు,డిమాండ్‌ గురించి చేసుకున్న ఎంవోయూలు, స్పాన్సర్‌ షిప్‌ తదిర అంశాలపై నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement