సీఎం వైఎస్ జగన్ పై ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గిడుగు రామమూర్తి తెలుగు భాషోద్ధారకుడు అయితే.. సీఎం జగన్ తెలుగు భాష విధ్వంసకుడని అన్నారు. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2,500 సంవత్సరాలు సుదీర్ఘ ప్రస్థానం కలిగిన అతి ప్రాచీనమైన భాష తెలుగని చెప్పారు. ఎక్కువ మంది మట్లాడే భాషలలో తెలుగుది ఏడోవ స్థానమని, దేశంలో నాలుగో స్థానమని గుర్తు చేశారు.
దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ఆత్మార్పణ చేశారన్నారు. రాష్ట్రంలో పాఠశాల విద్యలో తెలుగు మాద్యమాన్ని రద్దు చేసి, ఆంగ్లాన్ని ప్రవేశపెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించడం ఒక చారిత్రాత్మక తప్పిదమని విమర్శించారు. దీని వలన తెలుగు భాష కాలగర్భంలో కలిసిపోతుందని, తెలుగు జాతి అస్తిత్వం కోల్పోతుందన్నారు. ఈ చరిత్రాత్మక తప్పుడు నిర్ణయం జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండిః తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల లేఖ