Sunday, June 30, 2024

Congress – స‌మ‌సిన టీ క‌ప్పులో తుపాన్ – చ‌ల్ల‌బ‌డిన జీవ‌న్ రెడ్డి


ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి తో చ‌ర్చ‌లు స‌ఫ‌లం
బిఆర్ ఎస్ ఎమ్మెల్యే సంజ‌య్ చేరిక‌తో అలిగిన జీవ‌న్
పార్టీని వీడ‌తానంటూ స్టేట్మెంట్
రంగంలోకి దిగిన భ‌ట్టి, దుద్దిళ్ల‌
శాంతించిన సీనియ‌ర్ నేత …కాంగ్రెస్ లో ఉంటానంటూ ప్ర‌క‌ట‌న

తాను కాంగ్రెస్ పార్టీని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, సంజ‌య్ చేరిక విషయంలో మనస్థాపం చెందానని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నానన్నారు. ఎమ్మెల్సీ గా అసెంబ్లీకి వెళ్ళే హక్కు త‌న‌కు ఉందని..త‌న‌ కార్యకర్తలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. కాగా, బిఆర్ ఎస్ ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ కాంగ్రెస్ లో చేరిక విష‌యం త‌న‌కు ముందు చెప్ప‌లేదంటూ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి కినుక వ‌హించారు. అస‌హ‌నంతో పార్టీని విడ‌తానంటూ ప్ర‌క‌ట‌న కూడా చేశారు.. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కాంగ్రెస్ అధిష్టానం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ను జీవ‌న్ రెడ్డి ఇంటికి పంపింది..

- Advertisement -

ఆ ఇద్ద్ద‌రు నేత‌లు జీవ‌న్ రెడ్డి తో చ‌ర్య‌లు జ‌రిపారు.. అనంత‌రం జీవ‌న్ రెడ్డి మాట్లాడుతూ, త‌న అభిప్రాయాల‌ను భ‌ట్టికి వివ‌రించాన‌ని చెప్పారు… కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల‌ను తాను వెల్ల‌డించాన‌ని అంటూ తాను కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతున్న‌ట్లు చెప్పారు..

ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..”ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియర్ నాయకులు. మా అందరికీ మార్గదర్శకులు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుభవాన్ని ప్రభుత్వ నడపడం కోసం తప్పనిసరిగా వినియోగించుకుంటాం.కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని పది సంవత్సరాలు. కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ భావజాలాన్ని చట్టసభల్లో వినిపించిన సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి. ఈ ప్రభుత్వం నడవడం కోసం వారి ఆలోచనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటాం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియార్టీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సమచిత ప్రాధాన్యమిస్తూ గౌరవిస్తుంది. సీనియర్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వదులుకోవడానికి సిద్ధంగా లేదు. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మనస్థాపం పడితే మేమందరం బాధపడతాం.” అని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement