Thursday, November 21, 2024

AP: కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షమే.. ఏపీసీసీ సీనియర్ నేత మస్తాన్ వలి

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : వైసీపీ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తుందని, షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేయడం వారి అసమర్థతకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ సీనియర్ నేత మస్తాన్ వలీ విమర్శించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ నిరంతరం అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాననే పోరాడుతుందని చెప్పారు. షర్మిల టీడీపీకి కొమ్ముకాస్తుందన్న వైసీపీ నేతల విమర్శలను ఆయన ఖండించారు. తల్లికి వందనం పథకం మీద అధ్యక్షురాలిగా కూటమి సర్కార్ ను ప్రశ్నించారని, గత ప్రభుత్వం కూడా మోసం చేసిందని చెప్పారని గుర్తు చేశారు.

ఉన్న మాట చెప్తే జగన్ పార్టీకి ఉలుకు ఎందుకు అని ప్రశ్నించారు. షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారనీ అభూత కల్పనలు సృష్టిస్తున్నారనీ తెలిపారు. షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక ఎదురు దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఊహాజనిత మాటలు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారనీ, కాంగ్రెస్ మీద అక్కసు వెళ్లగక్కారన్నారు. ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఇస్తామని జగన్ అనలేదా ?, ఇద్దరు పిల్లలకు ఇస్తామని మీరు మాట ఇవ్వలేదా ?, షర్మిలమ్మ చేత మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఇస్తామని చెప్పించలేదా అని ప్రశ్నించారు.

సమాధానం చెప్పకుండా మా మీద దుమ్మెత్తి పోస్తున్నారనీ, ఎవరికి తొత్తుగా ఉండాల్సిన అవసరం తమకు లేదన్నారు. టీడీపీకి బీ టీమ్ గా ఉండాల్సిన అవసరం కాంగ్రెస్ కి లేదన్నారు. తొత్తులుగా బీజేపీ పంచన చేరింది మీరే అని ఎద్దేవా చేశారు. వైసీపీ బీజేపీకి ఒక తొత్తు పార్టీ అని ఘాటుగా విమర్శించారు. స్పీకర్ ఎన్నికల్లో సైతం వైసీపీ బీజేపీకి మద్దతు ఇచ్చింది వాస్తవం కాదా అన్నారు. అమ్మకు వందనం పథకం బాబు అందరికీ ఇవ్వాలని తమ పార్టీ అధ్యక్షురాలు డిమాండ్ చేశారనీ, కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ప్రజల పక్షం అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement