Friday, November 22, 2024

AP: రేపు అనంతపురంలో రాష్ట్ర పునర్నిర్మాణ సభ..హాజరుకానున్నకార్గే , షర్మిల

అనంతపురం బ్యూరో, ప్రభ న్యూస్​ : కాంగ్రెస్ పార్టీలో చేపడుతున్న రాష్ట్ర పునర్నిర్మాణ పోరాట సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పార్టీ రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారు. ఈనెల 26వ తేదీ సోమవారం సాయంత్రం అనంతపురం జూనియర్ కళాశాల గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు పూర్తి చేశారు. ఏపీసీసీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి డాక్టర్ సాకే శైలజనాథ్ గిడుగు రుద్దరాజు ఇతర నాయకులంతా ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ తన విధాన నిర్ణయాలను ఈ వేదికగా ప్రకటిస్తుందని ఆ పార్టీ పెద్దలు తెలిపారు.

- Advertisement -

అనంతపురం ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సెంటిమెంట్ గా తీసుకుంటుంది. ఏ కార్యక్రమం మొదలుపెట్టిన ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నట్లు నాయకులు తెలిపారు. రైతు ఆత్మహత్యలపై అధ్యయనం దీక్షలు ఇక్కడే ప్రారంభించగా సోనియా గాంధీ ఆధ్వర్యంలో రైతు కుటుంబాలకు పరిహారం అందించారు. రాష్ట్రంలో కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బండ్లపల్లి గ్రామంలో ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ అవుతుందని ఆ పార్టీ నేతలు నమ్మకం. ఇందులో భాగంగానే పోరాట సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

హాజరుకానున్న సిపిఐ సిపిఎం నేతలు
అనంతపురంలో సోమవారం జరుగుతున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచార శంఖారావం సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర నేతలు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తు కుదరడంతో కాంగ్రెస్ పార్టీలో వేదికను పంచుకుంటున్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జరుగుతున్నట్లు కనిపిస్తున్నా ఈ పార్టీలన్నీ కేంద్ర బిజెపి కనుసన్నల్లోనే పనిచేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ఒక్క మాట మాట్లాడకుండా రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు పది సంవత్సరాలుగా రాష్ట్రం అనేక రంగాల్లో వెనకబడడానికి ప్రధాన కారణం కేంద్ర బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి. గతంలో టిడిపి ప్రస్తుతం వైసిపి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి వత్తాసుగా నిలిచి ఏమి సాధించలేక పోయారన్నారు . మరల అదే బిజెపి ఆశీస్సుల కోసం తెలుగుదేశం, జపసేన ప్రత్యక్షంగా , వైసిపి పరోక్షంగా పోటీలు పడుతుండడం ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని కించపరచడంమే నన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మతసామరస్యం కోసం కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి పని చేయాలని నిర్ణయించాయి అందులో భాగంగా సోమవారం అనంతపురం జూనియర్ కాలేజీలో జరుగుతున్న కాంగ్రెస్ ఎన్నికల సభలో సిపిఎం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కె రామకృష్ణ పాల్గొంటున్నారని రాంభూపాల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement