Friday, November 22, 2024

AP: అవాక్కైన ఉపాధ్యాయులు ..మార్కులు వేయకపోతే.. చేతబడి చేయిస్తా…

నాకు మార్కులు వేయకపోతే.. మా తాత చేత చేతబడి చేయిస్తా.. ఇదీ ఇటీవల పదోతరగతి పబ్లిక్‌ పరీక్ష రాసిన ఓ విద్యార్థి సమాధానం. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. తెలుగు సబ్జెక్టులో రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఒక విద్యార్థి తగిన సమాధానం రాయకుండా నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని రాయడంతో ఉపాధ్యాయిని అవాక్కయ్యారు.

- Advertisement -

వెంటనే జవాబుపత్రాన్ని పై అధికారులకు చూపించారు. అయితే, సదరు విద్యార్థికి వందకు 70 మార్కులు రావడం విశేషం.
మరో జవాబుపత్రంలో రామాయణంలో పాత్ర స్వభావం గురించిన ప్రశ్నకు.. ‘మంధర.. శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది’ అని రాయడంతో.. ఉపాధ్యాయులు విస్తుపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement