Monday, November 18, 2024

Condemned – పాకిస్థాన్ లో హిందూ మ‌హిళ‌లు అత్మ‌హ‌త్య – అవేద‌న వ్య‌క్తం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్

అమరావతి: పాకిస్థాన్‌లో హిందూ మహిళల ఆత్మహత్యల ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్(ఎక్స్)లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భావోద్వేగంతో పోస్ట్ చేశారు. పాకిస్థాన్‌లో హిందూ సోదరీమణులు ఇలాంటి దారుణాలకు పాల్పడి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమ‌ని అన్నారు ఎపి ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ .. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లో హిందువుల దుస్థితి గురించి ఇలాంటి వార్తలు చూసిన ప్రతిసారీ నాకు చాలా బాధ కలుగుతుంద‌న్నారు.. హేమ, వెంటిల ఆత్మహత్యల ఘటన నన్ను కలచి వేసింది” అని పవన్ కల్యాణ్ భావోద్వేగం వ్యక్తం చేశారు.

కాగా.. పాకిస్థాన్‌లో మైనారిటీలైన హిందువులు అత్యంత దుర్భర పరిస్థితుల్లో కాలం గడుపుతున్నారు. హిందూ బాలికలకు కనీస రక్షణ కరువైంది. 15 రోజుల్లో నలుగురు హిందూ బాలికలు అపహరణకు గురవడంతో మైనారిటీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా పాకిస్థాన్‌లోని సింధ్‌లో ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ హిందూ బాలికను దుండగులు అపహరించుకుపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమె జాడ తెలియడం లేదు. హిందువులు, ఇతర మైనారిటీలు పాకిస్థాన్ జనాభాలో కేవలం 3.5 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఈ మైనారిటీలంతా మెజారిటీ ముస్లింల చేతుల్లో మత హింసకు గురవుతున్నారు. బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకు ఉద్దేశించిన బిల్లును గత ఏడాది అక్టోబరులో పార్లమెంటరీ ప్యానెల్ తిరస్కరించింది.
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్, హైదరాబాద్ పట్టణంలో ఇటీవల ఓ హిందూ బాలిక చంద్ర మహరాజ్‌ను కొందరు దుండగులు అపహరించారు. బాధితురాలి తల్లిదండ్రులు చెబుతున్నదాని ప్రకారం, చంద్రను ఫతే చౌక్ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. ఆమె ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆమె జాడ ఇంకా తెలియడం లేదు. కొద్ది రోజుల క్రితం ముగ్గురు హిందూ మహిళలను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మైనారిటీ హిందువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement