Friday, December 13, 2024

Condemned – అల్లు అర్జున్ కు అండ‌గా జ‌గ‌న్ – అరెస్ట్ ను ఖండించిన మాజీ సిఎం

అమ‌రావ‌తి – సినీ న‌టుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ ను ఎపి మాజీ ముఖ్య‌మంత్రి,వైసిపి అధినేత జ‌గ‌న్ ఖండించారు.. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు.హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిద‌న్నారు. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించార‌ని గుర్తు చేశారు. . అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? అని ప్ర‌శ్నించారు. తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాద‌ని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement