ఏపీలో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా చేతులు కలిపిన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటుపై అవగాహన కుదిరింది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల సమావేశం ముగిసింది. దాదాపు 8 గంటలపాటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య సీట్ల సర్దుబాటు, కూటమి వ్యూహాలపై సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో టీడీపీ నుంచి చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కల్యాణ్, బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్, బైజయంత్ పాండా పాల్గొన్నారు.
సుదీర్ఘ సమావేశం అనంతరం సీట్ల పంపకం వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు కేటాయించగా.. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో బరిలో దిగనుంది.