తిరుపతి సిటీ (ప్రభ న్యూస్): తిరుపతి – కరకంబాడి మార్గంలోనీ తిమ్మినాయుడు పాలెం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శ్మశానికి స్థలం కావాలని రోడ్డుపై మృతదేహంతో ధర్నాకు దిగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గ్రామానికి చెందిన అగరం నేలమ్మ సోమవారం రాత్రి చనిపోయింది. దీంతో ఆమె డెడ్‌బాడీతో కొంతమంది ఆందోళనకు దిగారు. కాగా, పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement