తిరుపతి (ప్రభ న్యూస్): చెస్ ఆడడం అలవర్చుకోవడం వల్ల విద్యార్థులలో ఏకాగ్రత, మేధాశక్తి పెరుగుతుందని జిల్లా చెస్ అసోసియేషన్ చైర్మన్ డాలర్స్ గ్రూప్ అఫ్ చైర్మన్ డాక్టర్ సీ. దివాకర్ రెడ్డి అన్నారు. సోమవారం యూత్ హాస్టల్ లో జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలు జరిగాయి. ఈ పోటీలను చెస్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు. చిన్నప్పటి నుండే చెస్ క్రీడను అలవార్చుకోవడం వల్ల క్రమశిక్షణ, ఏకగ్రత అలవడుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుండి క్రీడాలను అలవర్చుకోవాలని కోరారు. అనంతరం క్రీడాకారులతో కలసి ఆయన చెస్ ఆడారు.
ఈ చెస్ టోర్నమెంట్ లో మొదటి నాలుగు స్థానాలు సాధించిన మెన్ అండ్ విమెన్ క్రీడాకారులకు జిల్లా స్థాయి తరపున రాష్ట్ర స్థాయి పోటీలు.. మహిళలకు తిరుపతిలో ఈ నెల 26 నుండి 29 వరకు జరుగుతాయాని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస సూరి తెలిపారు. మహిళల రాష్ట్ర స్థాయిచెస్ ఛాంపియన్ షిప్ విజయవాడలో ఈ నెల 18 నుండి 21 వరకు జరుగుతాయాన్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు వీరే…
ఓపెన్ కేటగిరిలో విజేతలుగా నిలిచిన వారిలో యతిన్ రెడ్డి, త్రిపురాంబికా, లతీష్ రెడ్డి, పార్ధ సాయి ఉన్నారు.
మహిళ ల విభాగంలో..
మోడీత రెడ్డి, మాన్సీ, శ్రీ మహాలక్ష్మి, గురువాక్షిని ఎంపికయ్యారు