Saturday, January 11, 2025

Tirumala | తొక్కిసలాట బాధితులకు పరిహారం… చెక్కులు అందజేసిన టీటీడీ చైర్మన్

వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన ఏడుగురు బాధితులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరిహారం అందజేశారు.

తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన ఎస్.తిమ్మక్కకు, విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంకు చెందిన పీ.ఈశ్వరమ్మకు రూ.5లక్షలు, అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన కే.నరసమ్మ, పీ.రఘు, కే.గణేశ్‌, పీ.వెంకటేశ్‌, చిన్న అప్పయ్యకు రూ.2లక్షల చొప్పున పరిహారం చెక్కులను అందించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు బాధితులకు పరిహారం అందజేస్తున్నామన్నారు.

మృతుల కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి రూ.25 లక్షల పరిహారం అందజేస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అలాగే మృతుల‌ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పించ‌డం కోసం వివరాలు సేకరిస్తారని వెల్ల‌డించారు. మృతుల కుటుంబాల పిల్లలను చదివించేందుకు కూడా వివరాలు తీసుకుంటారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement